breaking news
Dhyan
-
యోగం – ధ్యానం
యోగాత్పరతరం పుణ్యంయోగాత్పరతరం శివమ్యోగాత్పరతరం సూక్ష్మంయోగాత్పరతరం నహియోగము కన్నా శ్రేష్ఠమైన పుణ్యము మరొకటి లేదు. యోగము కన్నా అధికమగు మంగళకరమూ లేదు. యోగము కన్నా శ్రేష్ఠమగు, సూక్ష్మతరమగు జ్ఞానమూ లేదు. యోగము కన్నా ఉత్కృష్టమగు వస్తువు మరొకటి లేదు. (యథార్థ భారతి ఫిబ్రవరి 2014 సంచిక) చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?నాస్తి ధ్యాన సమం తీర్థంనాస్తి ధ్యాన సమం తపఃనాస్తి ధ్యాన సమో యజ్ఞంతస్మాత్ ధ్యానం సమాచరేత్ ధ్యానంతో సమానమైన తీర్థం లేదు, ధ్యానంతో సమానమైన తపస్సు లేదు, ధ్యానంతో సమానమైన యజ్ఞం లేదు, కాబట్టి ధ్యానాన్ని బాగా ఆచరించండి అని దీని అర్థం. యోగం, ధ్యానం వేరు వేరు కాదు. యోగంప్రారంభ దశ, ధ్యానం తర్వాతి దశ. యోగం శరీరంతో మొదలై ధ్యానానికి బాటలు వేస్తుంది. శరీరం, మనసు, ఆత్మ అనేవి మూడు విడి విడి భాగాలు కావనీ; శరీరం స్థూలమైనదనీ, దానికంటే సూక్ష్మమైనది మనస్సనీ,అంతకంటే సూక్ష్మమై అన్నిటికీ కేంద్రమై ఆధారమైఉన్నది ఆత్మ అనీ అనుభవజ్ఞులు చెబుతారు. ఆత్మ దర్శనం కావాలన్నా, ఆత్మానుభూతి కావాలన్నా అంతర్ముఖులు కావాల్సిందే! యోగంతో... అంటే శరీరంతో ప్రారంభించి మనసుకు చేరితే తర్వాత జరగాల్సినది జరుగుతుందంటారు. అంటే ముందు శరీరాన్ని దోష రహితంగా, రోగ రహితంగా చేసుకోవాలి. తర్వాత మనసులోని మాలిన్యా లను తీసివేయాలి. వాటికి సహకరించేవే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాలు. ఇవన్నీ ఆచరిస్తే సమాధి అనే స్థితి కల్గుతుంది. యోగాన్ని సక్రమంగా అభ్యాసం చేసి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుదాం. ప్రపంచ శాంతికీ పాటుబడదాం. ‘యోగీ భవ’ అన్నది శ్రీకృష్ణుని సలహా. (పుట 552– గీతామకరందము)– రాచమడుగు శ్రీనివాసులుఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలు -
ధర్మ సందేహాలు: వాకింగ్ చేస్తూ భగవంతుని ధ్యానం మంచిదేనా?
భగవంతుని ధ్యానం చేసేటప్పుడు శుచిగా ఉండాలంటారు. నేను చాలాకాలం నుండి వాకింగ్ చేసేటప్పుడు భగవద్ధ్యానం చేస్తున్నాను. అది దోషమా? ‘ధ్యానం‘ శుచిగా చేయడం శ్రేష్ఠం. దానికి ఆసనం, ప్రాణాయామం సమకూరాలి. అటు తరువాతనే ధ్యానం. అయితే, నడకలో చేసే దానిని ’స్మరణ’ అంటారు. అది శ్రేష్ఠమైన విషయం. భగవత్ స్మరణ సర్వపాపహరం సర్వాభీష్ట ఫలప్రదం. అది నిరభ్యంతరంగా నడకలో చేయవచ్చు. మీరు చాలా కాలం నుండి చేస్తున్న భగవత్ స్మరణ మంచిదే. ధ్యానానికి గానీ, స్మరణకిగానీ ఆచమనం, సంకల్పం అవసరం లేదు. అవి లేకుండానే ధ్యాన–స్మరణలు చేయవచ్చు. అందులో దోషం ఏమీ లేదు. వాటికి తప్పక ఫలితం ఉంటుంది. పూజ’ అనేది బాహ్యం, మానసికం అని రెండు విధాలు. మానసిక పూజకి దేవుడు ఎదురుగా ఉండనక్కర్లేదు. ఈ మానసిక పూజని కొంతమేరకు ’ధ్యానం’ అని నిర్వచించవచ్చు. బాహ్య పూజకు ఎదురుగా దేవుని బింబం (పటంగానీ, విగ్రహంగానీ) ఎలాగూ అవసరమే కదా! ఆ పూజకు ఆచమనం, సంకల్పం వగైరాలు అవసరమే. బాహ్యపూజ వలన శరీర, మనశ్శుద్ధులు ఏర్పడి మానసికమైన భావన, స్మరణ, ధ్యానం వంటివి శీఘ్రంగా సిద్ధించే అవకాశం కలుగుతుంది. ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని అంటారు. నిజంగానే అంతమంది దేవతలున్నారా?ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న మాట నిజమే. ఇక్కడ కోటి అంటే మనం అనుకునే నూరు లక్షలు కాదు. సంస్కృతం లో కోటి అంటే విభాగం అని అర్ధం. మొత్తం ముప్పై మూడు రకాలయిన దేవతలు అని అర్థం వస్తుంది. వారు వరుసగా అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రుడు, బ్రహ్మ (ప్రజాపతి) కలిపి మొత్తం ముప్పైమూడు మంది దేవతలు. -
29న జిల్లా స్థాయి 5కే రన్
ఆర్మూర్అర్బన్ : హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఆర్మూర్‌లో 5కే రన్ నిర్వహిస్తున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్వీ హన్మంత్ రెడ్డి, మల్లేశ్‌గౌడ్‌లు బుధవారం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు పాఠశాలకు ఇద్దరు చొప్పున 5కే రన్లో పాల్గొనే అవకాశం ఉందని వారు వెల్లడించారు. పట్టణంలోని జంబిహనుమాన్ ఆలయ ప్రాంగణం నుంచి మామిడిపల్లి జాతీయ రహదారుల కూడలి వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మామిడిపల్లి విజయ్ హైస్కూల్లో విజేతలకు బహుమతులను అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే గతఏడాది వేల్పూర్‌లో సబ్ జూనియర్ వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీల సందర్భంగా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన 40 మంది పీఈటీ, పీడీలకు సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.