హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఆర్మూర్‌లో
29న జిల్లా స్థాయి 5కే రన్
Aug 24 2016 11:44 PM | Updated on Sep 4 2017 10:43 AM
	ఆర్మూర్‌అర్బన్ : హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఆర్మూర్‌లో 5కే రన్ నిర్వహిస్తున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్వీ హన్మంత్ రెడ్డి, మల్లేశ్‌గౌడ్‌లు బుధవారం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు పాఠశాలకు ఇద్దరు చొప్పున 5కే రన్‌లో పాల్గొనే అవకాశం ఉందని వారు వెల్లడించారు. పట్టణంలోని జంబిహనుమాన్ ఆలయ ప్రాంగణం నుంచి మామిడిపల్లి జాతీయ రహదారుల కూడలి వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మామిడిపల్లి విజయ్ హైస్కూల్‌లో విజేతలకు బహుమతులను అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే గతఏడాది వేల్పూర్‌లో సబ్ జూనియర్ వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీల సందర్భంగా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన 40 మంది పీఈటీ, పీడీలకు సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
