సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్‌ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. ఈ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళుల్పించారు.
స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. దేశభక్తి, ధైర్యం, పోరాట పటిమ, క్రమశిక్షణే ఆయన జీవన విధానం. నేతాజీ చూపిన పోరాట మార్గం నేటికీ ఆదర్శనీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన.
`స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. దేశభక్తి, ధైర్యం, పోరాట పటిమ, క్రమశిక్షణే ఆయన జీవన విధానం. నేతాజీ చూపిన పోరాట మార్గం నేటికీ ఆదర్శనీయం. నేడు ఆ… pic.twitter.com/N7XdSKBGV2
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2026
భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో అజరామర నాయకుడిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు ముద్రపడింది. ఆయన జీవితం ధైర్యం, త్యాగం, దేశభక్తి అనే మూడు మూలస్తంభాలపై నిర్మితమైంది. ఒడిశా(పూర్వపు ఒరిస్సా)లోని కటక్‌లో 1897 జనవరి 23న ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే బోస్ అసాధారణ ప్రతిభను ప్రదర్శించేవారు. ఐసీఎస్ (Indian Civil Services) పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగం చేయడం ఆయనకు నచ్చలేదు. అందుకే దేశ సేవే తన ధ్యేయమని భావించి.. ఆ ఉద్యోగాన్ని వదిలి స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, తరువాత ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం కోసం కేవలం అహింసా మార్గం సరిపోదని భావించి, ఆయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ ఆలోచనతోనే ఆయన భారతీయ జాతీయ సైన్యం (INA)ని ఏర్పాటు చేసి, “తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా(మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను)” అనే నినాదంతో ప్రజల్లో ఉత్సాహాన్ని రగిలించారు. బోస్ 1945లో విమాన ప్రమాదంలో ఆయన మరణించారని అధికారికంగా చెబుతారు. అయితే ఆ ప్రచారంపై అనేక సందేహాలు, చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.


