Bedtime Yoga : నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్‌ ఆసనాలు | Bedtime Yoga: The best yoga asanas for good sleep | Sakshi
Sakshi News home page

నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్‌ యోగాసనాలు

May 31 2025 11:05 AM | Updated on May 31 2025 11:37 AM

Bedtime Yoga: The best yoga asanas for good sleep

రాత్రి నిద్రించడానికి ముందు చేసే కొన్ని యోగాసనాల వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. గ్యాస్ట్రిక్,  పొట్ట భాగంలో అధిక కొవ్వు సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. భోజనం చేసిన రెండు గంటల తర్వాతనే ఈ ఆసనాలను సాధన చేయాలి. అప్పుడే నిద్ర, ఉదరకోశ సమస్యలకు సరైన ఫలితాలను  పొందుదుతారు. 

పవన ముక్తాసన 
యోగా మ్యాట్‌పైన వెల్ల్లకిలా పడుకోవాలి. మోకాళ్ళను వంచి, వాటిని ఛాతీ వైపు తీసుకురావాలి. మోకాళ్ళను చేతులతో కౌగిలించుకుని, 20 నుండి 30 సెకన్ల పాటు అదే స్థితిలో ఉండాలి. తర్వాత సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని 3 నుండి 5 సార్లు 
పునరావృతం చేయాలి.

సేతు బంధాసన
మ్యాట్‌పైన పడుకొని పాదాల మధ్య కొంత స్పేస్‌ ఉంచుతూ, తుంటి భాగాన్ని పైకి ఎత్తాలి. రెండు చేతులతో కాలి మడమలను పట్టుకోవాలి. ఈ భంగిమలో శరీరం వంతెన భంగిమను తలపిస్తుంది. 20 నుండి 30 సెకన్ల ΄ాటు అలాగే ఉండి, తర్వాత తుంటిని తిరిగి కిందకు దించాలి. ఈ ఆసనాన్ని 3 నుంచి 5 సార్లు పునరావృతం చేయాలి. 

చదవండి: Yoga 9 ఏళ్లకే గిన్నిస్‌ రికార్డు‘యోగం’

వజ్రాసన
మోకాళ్లను వంచి,పాదాల మీదుగా హిప్‌ భాగం వచ్చేలా కూర్చోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. రెండు చేతులను పొట్ట దగ్గరగా ఉంచాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ, వదలాలి.  ఈ ఆసనంలో సౌకర్యంగా ఉన్నంత సేపు కూర్చోవచ్చు. 

ఇదీ చదవండి: NMACC లో బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌
 

Advertisement
 
Advertisement
Advertisement