ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు | Rare Event In Siddipet, Triplet Baby Boys Born In One Delivery At Private Hospital | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు

Mar 23 2026 11:01 AM | Updated on Mar 23 2026 11:22 AM

Triplets Born In Siddipet Private Hospital

సిద్దిపేటజోన్‌: ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు జన్మించిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆదివారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన 26 ఏళ్ల గర్భిణి ప్రసవం కోసం ఆ ఆçస్పత్రిలో చేరింది. నొప్పులు అధికం కావడంతో ఆదివారం తెల్లవారుజామున ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. తొలి కాన్పులో ముగ్గురు మగ శిశువులు జన్మించారు. వారిలో ఒకరు 2.75కిలోలు, మరొకరు 2.25 కిలోలు, ఇంకొకరు 2 కిలోలు ఉన్నట్టు వైద్యురాలు రమాదేవి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement