పండెరుపు చీరలో శ్రద్ధ స్టన్నింగ్‌ లుక్‌..ధర ఎంతంటే! | Shraddha Kapoor's Rs 31500 Floral Red Saree For Stree 2 Teaser Launch | Sakshi
Sakshi News home page

పండెరుపు చీరలో శ్రద్ధా స్టన్నింగ్‌ లుక్‌..ధర ఎంతంటే!

Published Sun, Jun 16 2024 5:34 PM | Last Updated on Sun, Jun 16 2024 6:17 PM

Shraddha Kapoor's Rs 31500 Floral Red Saree For Stree 2 Teaser Launch

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రద్ధా కపూర్ టీన్ పట్టి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయింది. అయితే ఆషికీ-2 సినిమాతోనే శ్రద్ధా కపూర్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ నటనకు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇప్పుడు శ్రద్ధా స్ట్రీ2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో శ్రద్ధా సంప్రదాయ చీరలో తళుక్కమంది. ఈ చీర ఆమె ఫ్యాషన్‌ శైలి ఏంటో చెప్పకనే చెప్పింది. ఆమె పూల మొక్కలతో కూడిన పండెరుపు చీరలో శ్రద్ధా ఎర్ర గులాబీలా అందంగా కనిపించింది.

ఆ చీరకు తగ్గట్టు గోల్డెన్‌ బ్యాంగిల్స్‌, చక్కటి చెవిపోగులు, స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, సింపుల్‌ మ్యాకప్‌తో మరింతో అందంగా కనిపించిది. ఈ చీరను డిజైనర్‌ ధృవ్‌ పంచల్‌ తీర్చిదిద్దారు. దీని ధర ఏకంగా రూ. 31,500/-. శ్రద్ధా ఇలా చీరలో ఇంతకుమునుపు కూడా సందడి చేసింది. ప్రతి చీర ఆమె స్కిన్‌ టోన్‌కి తగ్గట్లుగా ఎంపిక చేసుకుంటుంది. తన లుక్‌ అందంగా కనిపించేలా సింపుల్‌ మేకప్‌కే ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఆమె నట్టించిన స్ట్రీ2 మూవీ వచ్చే నెల ఆగస్ట 15 థియోటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తన మూవీ ‍ప్రమోషనల్‌ సందడి చేసేలా తన లుక్స్‌  పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది శ్రద్ధా..

(చదవండి: స్లిమ్‌గా మారిన నటి విద్యాబాలన్‌..ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement