
స్ట్రాటజి
జాబ్ మార్కెట్‌లో విపరీతంగాపోటీ ఉండడం వల్ల ఉద్యోగం రావడం అంతా ఆషామాషీ విషయం కాదు. కాని కొందరికి మాత్రం ఇట్టే ఉద్యోగాలు వస్తాయి. అలాంటి వారిలో షారన్ మెల్జర్ (Sharon Melzer) ఒకరు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఉద్యోగాన్ని సొంతం చేసుకొని ‘వావ్’ అనిపించింది. తన విజయరహస్యం (success secret) గురించి ‘లింక్డ్ ఇన్’లో పంచుకుంది.
‘ఒక ఉద్యోగానికి మనం దరఖాస్తు చేసుకున్నామంటే ఈ ఉద్యోగం (Job) కచ్చితంగా నాదే’ అనే ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటుంది షారన్ మెల్జర్.
ఒక సోషల్ మీడియాలో కమ్యూనిటీ మేనేజర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకుంది షారన్. దరఖాస్తు చేసుకున్న వారిని కొత్త ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌కు సంబంధించి కంటెంట్ స్ట్రాటజీని సబ్‌మిట్ చేయాల్సిందిగా కంపెనీ అడిగింది. చాలామంది బేసిక్ డాక్యుమెంట్‌ను సమర్పించారు. షారన్ మాత్రం రెండు అడుగులు ముందు వేసింది. అత్యంత వివరంగా, సృజనాత్మకంగా కంటెంట్ ప్లాన్ తయారుచేసింది. తన ఐడియాలకు సంబంధించి వీడియో ప్రెజెంటేషన్‌ను రూ పొందించింది. మిగిలిన రెజ్యూమ్‌లతో పోల్చితే షారన్ రెజ్యూమ్ ప్రత్యేకంగా కనిపించింది. ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేసింది. ‘ఎక్స్‌ట్రా ఎఫర్ట్ అనేది ఎప్పుడూ మంచిదే’ అంటుంది షారన్.
చదవండి: ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీ