మొక్కజొన్న చొప్పతో జెట్‌ ఇంధనం! | Sagubadi, Agricultural Waste Offers New Hope For Sustainable Aviation Fuel, More Details Inside | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న చొప్పతో జెట్‌ ఇంధనం!

Jun 5 2026 11:01 AM | Updated on Jun 5 2026 11:34 AM

Sagubadi: Making jet fuel from corn stover

మొక్కజొన్న కంకుల్ని కోసిన తర్వాత మిగిలే ఎండు చొప్పతో జెట్‌ విమానాలను నడిపే ఖరీదైన ఇంధనాన్ని రూపొందించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవటంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పశ్చమాసియా యుద్ధం ్ర΄ారంభమైన తర్వాత విమానయాన ఇంధనం ధర రెట్టింపైంది. విమానయాన సంస్థలు పెట్రోలియంకు ప్రత్యామ్నాయాలను కనుగొని, తమ ఉద్గారాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. మొక్కజొన్న పంట వ్యర్థాలను ఇంధనంగా మార్చడం దీనికి ఒక గొప్ప ఆరంభం కానుంది. ప్రతి పంట కోత కాలం తర్వాత అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న పొలాలు ఎండిన చొప్ప, ఆకులతో నిండి΄ోతాయి. మొక్కజొన్న కంకులను సేకరించిన తర్వాత మిగిలి΄ోయే వ్యర్థాలు ఇవి. కొంతమంది రైతులు ఈ చొప్పను జంతువులకు మేతగా వేస్తారు లేదా పంటల మధ్యన ఆచ్ఛాదనగా లేదా సహజ కం΄ోస్టు ఎరువుగా తయారు చేసి భూసారాన్ని పెంచటానికి ఉపయోగిస్తారు. కానీ, అమెరికా వంటి దేశాల్లో మొక్కజొన్న వ్యర్థాల్లో చాలా భాగం సరిగ్గా ఉపయోగపడకుండానే మిగిలిపోతోంది.

వరల్డ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (డబ్ల్యూఆర్‌ఐ) తాజా పరిశోధన ప్రకారం.. విమానయాన రంగంలో ఉద్గారాలను తగ్గించటం అత్యంత క్లిష్టతరమైన పని. అయితే, మొక్కజొన్న వ్యర్థాలను ఈ పని కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని తేలింది. మొక్కజొన్న చొప్ప నుంచి జెట్‌ ఇంధనాన్ని తయారు చేయటం ద్వారా ఈ  ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను వాతావరణ మార్పులకు దోహదపడకుండా తీర్చవచ్చు.

ఇరాన్‌పై యుద్ధం కారణంగా హోర్ముజ్‌ జలసంధి మూసివేతతో ముడి చమురుతో తయారయ్యే సాంప్రదాయ జెట్‌ ఇంధనం ధర ప్రపంచవ్యాప్తంగా ఇటీవల రెట్టింపు అయ్యింది. కానీ, ప్రపంచ ఉద్గారాల్లో 2.4% కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోలియం జెట్‌ ఇంధనానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసే కృషి ఈ యుద్ధానికి ముందే మొదలైంది. విమాన ప్రయాణానికి డిమాండ్‌ పెరిగేకొద్దీ, 2050 నాటికి ఈ ఇంధన కాలుష్యం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా.

చొప్పతో 10% జెట్‌ ఇంధనం
మొక్కజొన్న చొప్ప వ్యర్థాలతో జెట్‌ ఇంధనం తయారీ ప్రక్రియ మనుషులకూ, పర్యావరణానికీ కూడా మేలు చేసే ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అని డబ్ల్యూఆర్‌ఐ పరిశోధనలో తేలింది. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి పొలాల్లోనే వదిలివేయాల్సిన భాగాన్ని మినహాయించిన తర్వాత, అమెరికాలో ప్రతి సంవత్సరం 9 కోట్ల టన్నుల మొక్కజొన్న చొప్ప అందుబాటులో ఉంటుందని అంచనా. 

ఇది 300 కోట్ల గ్యాలన్ల నిజమైన సుస్థిర ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది. ఈ మొత్తం అమెరికా వైమానిక ఇంధన కాలుష్యాన్ని 75% తగ్గింపునకు దోహదపడుతుంది. అంతేకాకుండా, అమెరికా జెట్‌ ఇంధన అవసరతను 10 శాతం వరకూ తీరుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో మొక్కజొన్న ఇథనాల్‌ను జెట్‌ ఇంధనంగా మార్చుతున్నారు. ఈ పనికి స్వస్తి చెప్పటం ద్వారా ఆహార ధాన్యాలను ఇంధనానికి వాడటం మానుకోవచ్చు. 

దీని వలన కలిగే ప్రయోజనం కేవలం వాతావరణానికి మాత్రమే పరిమితం కాదు. మొక్కజొన్న చొప్ప ఇంధనోత్పత్తి అనేక ఉద్యోగాలను, ఇతర ఆర్థిక ప్రయోజనాలను సృష్టించగలదని నిపుణులు చెబుతున్నారు. డబ్ల్యూఆర్‌ఐ పరిశోధన ప్రకారం, సంవత్సరానికి 300 కోట్ల గ్యాలన్ల మొక్కజొన్న చొప్పతో వైమానిక ఇంధనం ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల 99 వేల నుంచి 2.14 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చు. సంబంధిత ఆర్థిక కార్యకలా΄ాలు వేలాది కోట్ల డాలర్ల పన్ను రాబడి అదనంగా చేకూరుతుందని అంచనా.

ప్రాథమిక దశలో పరిశోధనలు
మొక్కజొన్న చొప్పను జెట్‌ ఇంధనంగా మార్చే సాంకేతికతలపై పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. సాంప్రదాయ జెట్‌ ఇంధనాలతో ధరల పరంగా ఈ ప్రత్యామ్నాయ ఇంధనం ఇంతకుముందు వరకు ΄ోటీపడలేక΄ోవడం కూడా ఇందుకు ఓ కారణం. కానీ ఇరాన్‌పై యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ సంఘర్షణల కారణంగా సాంప్రదాయ ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ అంతరం తగ్గుతోంది. దీనివల్ల కొత్త రకాల విమానయాన ఇంధనోత్పత్తి రంగం పెట్టుబడిదారులకు, విమానయాన సంస్థలకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది.

పరిశోధన, అభివృద్ధికి విధానపరమైన మద్దతు, విస్తరణ ప్రోత్సాహకాలు లేకుండా మొక్కజొన్న చొప్పతో ఇంధనం ఉత్పత్తి సాంకేతికతల అభివృద్ధి యజ్ఞం నెరవేరదు. డబ్ల్యూఆర్‌ఐ పరిశోధన ప్రకారం, అన్ని సమస్యలకు ఒకే పరిష్కారంగా పనిచేసే సాంకేతికత అంటూ ఏదీ లేదు. దానికి బదులుగా, ఏ సాంకేతికతలకు అత్యధిక సామర్థ్యం ఉందో అర్థం చేసుకోవడానికి, విభిన్న రకాల సాంకేతికతల పరిశోధన, అభివృద్ధికి విధానాల మద్దతు ఇవ్వాలి. 

మొక్కజొన్న చొప్ప అమెరికాలో అత్యంత సవృద్ధిగా లభించే వ్యవసాయ వ్యర్థం. చొప్ప ఆధారిత విమానయాన ఇంధనోత్పత్తి పరిశ్రమ మన ఇంధన భద్రతకు దోహదపడటంతో పాటు, విమానయాన ఉద్గారాలను తగ్గించి, మొక్కజొన్న ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యగలదని నిపుణులు భావిస్తున్నారు.                              
 

(చదవండి: అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!)

Advertisement
 
Advertisement
Advertisement