అత్యంత స్టైలిష్‌ డిజైనర్‌వేర్‌లో మమ్దానీ భార్య రామా దువాజీ..! | NYC First Lady Rama Duwaji showed up in style at the Knicks championship | Sakshi
Sakshi News home page

అత్యంత స్టైలిష్‌ డిజైనర్‌వేర్‌లో మమ్దానీ భార్య రామా దువాజీ..!

Jun 19 2026 5:20 PM | Updated on Jun 19 2026 10:58 PM

NYC First Lady Rama Duwaji showed up in style at the Knicks championship

న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో డెమొక్రటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ అభ్యర్థి, ఉగాండ-భారత సంతతికి చెందిన 34 ఏండ్ల జోహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మమ్దానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయస్సులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించడమే కాదు అటు న్యూయార్క్‌ నగర ప్రజలను కూడా ఆశ్చర్యపరిచిన వ్యక్తి. 

అలాంటి మామ్దానీ తన భార్యతో కలిసి చాలా అరుదుగా బహిరంగ కార్యక్రమాలకు హాజరవ్వుతారు. ఇటీవల నిక్స్‌ ఎన్బీఏ ఛాంపియన్‌షిప్ వేడుకకు దంపతులిరువురి హాజరయ్యే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ వేడుకలో మమ్దానీ భార్య రామా దువాజీ CFDA ఫ్యాషన్ ఫండ్ ఫైనలిస్ట్ మిస్ క్లైర్ సుల్లివన్ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను ధరించారు. ఆమె ఫ్యాషన్‌ ఎంపిక న్యూయార్క్‌ నిక్స్‌ జట్టు(బాస్కెట్‌బాల్‌ టీమ్‌) స్ఫూర్తినిచ్చింది. వన్-షోల్డర్ పెప్లమ్ టాప్‌ను నల్లటి స్కర్ట్‌తో జత చేశారు. 

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే..డిజైనర్‌ క్లైర్‌ ఒక నకిలీ వస్తువుల విక్రేత నుంచి సేకరించిన వివిధ రంగులలోని నిక్స్‌ షర్టుల నుంచి రూపొందించారు. ఆ లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా..ఒక న్యూయార్క్ డిజైనర్‌ టాలెంట్‌ని ప్రమోట్ చేసింది. ఇది పర్యావరణ అనుకూలమైనది. దువాజీ తన దుస్తులకు నైక్ ఎయిర్ రిఫ్ట్ చెప్పులను జతచేశారు. అలాగే నారింజ రంగు పామ్-పామ్ చెవిపోగులతో స్టైలిష్‌గా కనిపించారు. 

దువాజీ బహిరంగంగా కనిపించిన ప్రతిసారి తన విలక్షణమైన ఫ్యాషన్‌తో ఆకట్టుకుంటారామె. గతంలో కూడా ఆమె నవంబర్‌4, 2025న మమ్దానీ ఎన్నికల్లో గెలుపొందినప్పడూ కూడా పాలస్తీనియన్-జోర్డానియన్ డిజైనర్ రూపొందించిన లేజర్-కట్ డెనిమ్ టాప్‌తో ఆకర్షణీయంగా కనిపించారు. కాగా, ఇక మమ్దానీ కూడా ఈ వేడుకలో తన సూట్‌ జాకెట్‌ కింద జోష్ హార్ట్ జెర్సీని ధరించి నిక్స్ స్ఫూర్తిని ప్రతిబింబించారు.

(చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement