మిసెస్‌ బిహార్ 2025గా బీజేపీ ఎమ్మెల్యే భార్య..! | Mrs Bihar 2025 Is Aishwarya Raj She is BJP MLA Vishal Prashant wife | Sakshi
Sakshi News home page

మిసెస్‌ బిహార్ 2025గా బీజేపీ ఎమ్మెల్యే భార్య..!

Jun 19 2025 6:18 PM | Updated on Jun 19 2025 6:27 PM

Mrs Bihar 2025 Is Aishwarya Raj She is BJP MLA Vishal Prashant  wife

ఇటీవల మహిళలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు నిదర్శనం వారు సాధిస్తున్న విజయాలే. పెళ్లిచేసుకుని, పిల్లలను కని..అక్కడితో తమ జీవితాన్ని పరిమితం చేయడం లేదు. కొన్నేళ్లు విరామం ఇచ్చి మళ్లీ తమ కెరీర్‌లో పుంజుకోవడమో లేదా తమకు నచ్చిన వ్యాపకంతోనో ముందుకు సాగుతున్నారు. పైగా అందులో అనూహ్యమైన విజయాలు అందుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆ కోవకు చెందినవారే ఐశ్వర్య రాజ్

ఇటీవల బిహార్‌లో మిసెస్‌ బిహార్‌ 2025 పోటీలు ముగిశాయి. ఆ పోటీల్లో భోజ్‌పూర్ జిల్లా, తరారి బిజెపి ఎమ్మెల్యే విశాల్ ప్రశాంత్ భార్య ఐశ్వర్య రాజ్‌ మిసెస్‌ బిహార్‌గా కిరీటాన్ని దక్కించుకోవం విశేషం. ఆమె ఆధునిక ఆశయాలు, సంప్రదాయ విలువలు కలిగిన శక్తిమంతమైన మహిళ. బిహార్‌లోని ప్రముఖ రాజకీయ కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని కలిగి ఉన్న మహిళ ఐశ్శర్య రాజ్‌. 

ఈ పోటీలో 14 మంది మహిళలు కిరీటం కోసం పోటీపడగా..ఐశ్వర్య తన ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో విజయం సొంతం చేసుకుని కిరీటాన్ని కైవసం చేసుకుంది. అంతేగాదు తన గెలుపుతో మహిళలు కుటుంబ జీవితానికే పరిమితం కాకుండా తమదైన రంగంలో ఎలా గెలవాలో ప్రేరణగా నిలిచారామె. 

ఇక పాట్నాలో పెరిగిన ఐశ్వర్య చదువంతా ఢిల్లీలోనే సాగింది. అక్కడే ఫైనాన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అలాగే కార్పొరేట్‌ ప్రపంచంలో కూడా తనదైన ముద్రవేసింది. కాగా, పలువురు నెటిజన్లు ఆమె గెలుపుని బిహార్‌కే గర్వకారణం. పైగా ప్రతిభ, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలనుకునే మహిళలకు ఆమె స్ఫూర్తి అంటూ ఐశ్వర్యపై ప్రశంసల జల్లు కురిపిస్తు పోస్ట్‌లు పెట్టారు. 

 

(చదవండి: ఐదు పదుల వయసులోనూ యువకుడిలా రాహుల్‌ గాంధీ..! రీజన్‌ అదే..)
 

Advertisement
 
Advertisement
Advertisement