breaking news
aishwarya raja
-
మిసెస్ బిహార్ 2025గా బీజేపీ ఎమ్మెల్యే భార్య..!
ఇటీవల మహిళలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు నిదర్శనం వారు సాధిస్తున్న విజయాలే. పెళ్లిచేసుకుని, పిల్లలను కని..అక్కడితో తమ జీవితాన్ని పరిమితం చేయడం లేదు. కొన్నేళ్లు విరామం ఇచ్చి మళ్లీ తమ కెరీర్లో పుంజుకోవడమో లేదా తమకు నచ్చిన వ్యాపకంతోనో ముందుకు సాగుతున్నారు. పైగా అందులో అనూహ్యమైన విజయాలు అందుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆ కోవకు చెందినవారే ఐశ్వర్య రాజ్ఇటీవల బిహార్‌లో మిసెస్ బిహార్ 2025 పోటీలు ముగిశాయి. ఆ పోటీల్లో భోజ్‌పూర్ జిల్లా, తరారి బిజెపి ఎమ్మెల్యే విశాల్ ప్రశాంత్ భార్య ఐశ్వర్య రాజ్ మిసెస్ బిహార్‌గా కిరీటాన్ని దక్కించుకోవం విశేషం. ఆమె ఆధునిక ఆశయాలు, సంప్రదాయ విలువలు కలిగిన శక్తిమంతమైన మహిళ. బిహార్‌లోని ప్రముఖ రాజకీయ కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని కలిగి ఉన్న మహిళ ఐశ్శర్య రాజ్. ఈ పోటీలో 14 మంది మహిళలు కిరీటం కోసం పోటీపడగా..ఐశ్వర్య తన ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో విజయం సొంతం చేసుకుని కిరీటాన్ని కైవసం చేసుకుంది. అంతేగాదు తన గెలుపుతో మహిళలు కుటుంబ జీవితానికే పరిమితం కాకుండా తమదైన రంగంలో ఎలా గెలవాలో ప్రేరణగా నిలిచారామె. ఇక పాట్నాలో పెరిగిన ఐశ్వర్య చదువంతా ఢిల్లీలోనే సాగింది. అక్కడే ఫైనాన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అలాగే కార్పొరేట్ ప్రపంచంలో కూడా తనదైన ముద్రవేసింది. కాగా, పలువురు నెటిజన్లు ఆమె గెలుపుని బిహార్‌కే గర్వకారణం. పైగా ప్రతిభ, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలనుకునే మహిళలకు ఆమె స్ఫూర్తి అంటూ ఐశ్వర్యపై ప్రశంసల జల్లు కురిపిస్తు పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by 👑 AISHWARYA RAJ 👑 (@aishwarya.raj95) (చదవండి: ఐదు పదుల వయసులోనూ యువకుడిలా రాహుల్ గాంధీ..! రీజన్ అదే..) -
యాక్షన్.. థ్రిల్
రజత్ రాఘవ్, ఐశ్వర్యా రాజ్ బకుని జంటగా రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషల్ థ్రిల్లర్ అండ్ ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘మహర్ యోధ్ 1818’. సువర్ణ రాజు దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో మొదలైంది. భద్రకాళీ పీఠం పీఠాధీశ్వరి డా. సింధు మాతాజీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఏపీయస్సీ సెల్ కమీషనర్ విక్టర్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు నక్కిన త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘చక్కని కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
వెండి తెర నాయికగా మరో విద్యార్థిని
ఇంటర్ చదువుతుండగానే కేరళకు చెందిన అమ్మాయిలు హీరోయిన్గా పరిచయం అవడం పరిపాటే. అమలాపాల్, లక్ష్మీ మీనన్‌లాంటి వారు ఈ కోవకు చెందిన వారే. వీరి జాబితాలో తాజాగా మరో కేరళ కుట్టి చేరారు. ఈమె పేరు ఐశ్వర్య రాజా. అయితే ఈ భామకో ప్రత్యేకత ఉంది. ప్లస్-2 పాస్ అవడం విశేషం కాదు. ఈ పరీక్షలో 1200 మార్కులకు 1200 సాధించి రికార్డు కెక్కారు. ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తున్న తొలి తమిళ చిత్రం పళ్లికూడం పోగామలే. గణేశ్ వెంకట్రామన్ తేజస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇటీవల కాలం చేసిన ప్రముఖ తెలుగు నటుడు శ్రీహరి ముఖ్య పాత్ర పోషించడం విశేషం. రాజాకపూర్, ఎ.వెంకటేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని బెస్ట్ రిలీజ్ పతాకంపై డాక్టర్ ఎస్.ఇ.పి.తంబి, ఎస్.మహేశ్ నిర్మిస్తున్నారు. జయశీలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో ఫెయిలవుతున్న భయంతోనే కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. అయితే పరీక్షలో పాస్ అయినంత మాత్రాన జీవితాన్ని నిర్ణయించలేవన్నారు. ఫెయిల్యూర్ అన్నది ఒక పాఠమే కానీ అదే జీవితానికి అంతం కాదనే సందేశంతో కూడిన జన రంజక చిత్రంగా పళ్లికూడం పోగామలేనూ తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.