యాక్షన్‌.. థ్రిల్‌ | DSR films Mahar Yodh 1818 Movie opening | Sakshi
Sakshi News home page

యాక్షన్‌.. థ్రిల్‌

Oct 27 2023 3:42 AM | Updated on Oct 27 2023 3:42 AM

DSR films Mahar Yodh 1818 Movie opening - Sakshi

రజత్, ఐశ్వర్యా రాజ్‌ 

రజత్‌ రాఘవ్, ఐశ్వర్యా రాజ్‌ బకుని జంటగా రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషల్‌ థ్రిల్లర్‌ అండ్‌ ఫ్యాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘మహర్‌ యోధ్‌ 1818’. సువర్ణ రాజు దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో మొదలైంది.

భద్రకాళీ పీఠం పీఠాధీశ్వరి డా. సింధు మాతాజీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఏపీయస్‌సీ సెల్‌ కమీషనర్‌ విక్టర్‌ ప్రసాద్‌ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు నక్కిన త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘చక్కని కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement