సాక్షి శుభమస్తు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రొ.ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. అథర్వణ వేదం ప్రత్యేకత, బీజ మంత్రాల శక్తి, సామాన్య ప్రజల అవసరాలకు వేదం, వేదవ్యాసుడు అథర్వవేదాన్ని వేరుగా చూపిన కారణం, తంత్రం, అభిచార క్రియలపై అభిప్రాయం, చేతబడులు, వశీకరణంపై, యక్షిణి గురించి వివరణ ఇచ్చారు. ఆయుర్వేదం, గణితం, ప్రకృతి విజ్ఞానం వంటి అనేక శాస్త్రాలకు సంబంధించిన అంశాలు అథర్వణ వేదంలో ఉన్నాయని పేర్కొన్నారు.
సంతానం, ఆరోగ్యం, శత్రు బాధ నివారణ, ఓజస్సు, తేజస్సు వంటి జీవిత అవసరాలకు సంబంధించిన మంత్రాలు అథర్వణవేదంలో ఉన్నాయని చెప్పారు. కలియుగంలో గతంలో ఉన్నట్లు శక్తిమంతమైన మారణ, మోహన, వశీకరణ విద్యలు మనుషుల చేత సాధ్యం కావని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. మూఢనమ్మకాల వెంట వెళ్లకుండా వేదాలను శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేయాలని, నిజమైన గురువుల బోధనలు చదవాలని, "సింపుల్ లివింగ్ – హై థింకింగ్"తో జీవించాలని యువతకు సూచించారు. అథర్వణ వేదం అందరూ చదవచ్చా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ప్రొ.ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి అందించారు. ఈ వివరాలు కింది వీడియోలో చూడండి..


