పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్‌.. | Home Decoration With Fruits And Vegetables | Sakshi
Sakshi News home page

పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్‌..

Apr 27 2025 8:17 AM | Updated on Apr 27 2025 8:17 AM

Home Decoration With Fruits And Vegetables

వేసవిలో పండ్లు, కూరగాయల జ్యూస్‌ల వాడకం సహజంగానే ఎక్కువ. ఆరోగ్యం గురించే కాదు, వీటిని ఇంటి అలంకరణలోనూ వాడచ్చు. సహజమైన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి కృత్రిమమైన పండ్లు, కూరగాయలు, వనమూలికలతో ఇంటిని అలంకరించవచ్చు. 

ఇంటి వాతావరణం చల్లగా, సహజత్వానికి దగ్గరగా ఫామ్‌హౌస్‌ వాతావరణాన్ని సృష్టించాలనుకున్నా, సమృద్ధిగా పంటల థీమ్‌ను సృష్టించాలనుకున్నా, వనమూలికల ఉపయోగాలు తెలుసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నా, ఫ్రూట్‌ అండ్‌ వెజిటబుల్‌ డెకర్‌ ఈ సీజన్‌కి సరైన ఎంపిక అవుతుంది.

కిచెన్‌ డెకర్‌
గిన్నెల్లో, వంటగది కౌంటర్‌టాప్‌ లేదా డైనింగ్‌ టేబుల్‌పై పండ్లబుట్ట ఉంచి, వాటిలో కృత్రిమ పండ్లు, కూరగాయలను ప్రదర్శించవచ్చు. ఆర్టిఫిషియల్‌ పండ్లు, కూరగాయలు, మూలికలు, పువ్వులు లేదా పచ్చదనంతో సెంటర్‌ టేబుల్‌పైన సెంటర్‌ పీస్‌ను క్రియేట్‌ చేయండి. మరింత అందంగా కనిపించడానికి ఓ వెదురు బుట్ట లేదా జాడీ ఉంచండి. 

ఫామ్‌హౌస్‌ శైలి
పట్టణవాసులు ఇటీవల ఫామ్‌ హౌస్‌లను బాగా ఇష్టపడుతున్నారు. అందుకని, ఫామ్‌హౌస్‌ అలంకరణను మన ఇంట్లోకి తీసుకురావచ్చు. వెదురు లేదా తీగలతో అల్లిన బుట్టలు, జ్యూట్‌ బ్యాగుల్లో మీకు నచ్చిన చెర్రీ, బెర్రీ, నిమ్మ, ఆరెంజ్, అరటి, మామిడి.. వంటి కృత్రిమ పండ్లు, కూరగాయలు, మూలికలను చేర్చండి. 

హెర్బల్‌ గార్డెన్‌
కృత్రిమ మూలికలతో ఇండోర్‌ హెర్బల్‌ గార్డెన్‌ను సృష్టించవచ్చు. తాజా అనుభూతి కోసం వంటగదిలో కుండలు లేదా వేలాడే బుట్టలనూ ఉంచవచ్చు. నిమ్మ, నారింజ చెట్లు వంటి కృత్రిమ పండ్ల చెట్లను పెద్ద కుండలలో ఉంచి ప్రదర్శించవచ్చు.  
ఎన్‌.ఆర్‌

(చదవండి: వేసవి అంటే సెలవులేనా?)
 

Advertisement
 
Advertisement
Advertisement