ఫండే
ఘనాంకాలు
గ్రాఫిక్స్ : సీతారాం
వెలగపండు మన దేశంలో పురాతనకాలం నుంచి ఉన్నదే! భారత్ సహా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో విరివిగా పండే వెలగపండును వినాయక చవితి సహా పలు పర్వదినాలలో నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. వెలగపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మిగుల పండిన వెలగపండు ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుందని ‘చరకసంహిత’ సహా పలు ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు కూడా చెబుతాయి. వెలగపండు దిగుబడిలో మన భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. వెలగపండు విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...
వెలగపండులో పోషకాలు..
వెలగపండులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పుష్కలంగా పీచుపదార్థాలతో పాటు విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. వెలగపండు ప్రతి వందగ్రాములకు 140 కిలోకేలరీల శక్తినిస్తుంది. ఇందులో నీరు 64% –74% వరకు ఉంటుంది. వెలగపండులోని పోషకాల గురించి గణాంకాల్లో చూద్దాం...
ఇదీ చదవండి: కాగితం విమానాలతో గిన్నిస్ రికార్డు.. ఇతడి టాలెంట్కు హ్యాట్సాఫ్!


