ఫండే
చిన్నప్పుడు కాగితంతో పడవలు, విమానాలు చేసి ఆడుకున్న రోజులు గుర్తున్నాయా? అలాంటి సరదా పనితోనే ప్రపంచ రికార్డు సృష్టించవచ్చని నిరూపించారు అమెరికాకు చెందిన డేవిడ్ రష్. కేవలం గంట వ్యవధిలో 415 కాగితం విమానాలు మడిచి ఎగరేసి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించారు!
కాగితం పడవలు, విమానం చేయటం చిన్నప్పుడు ఆట! కాని, అదే కాగితం విమానాలు కొన్ని వందలు చేస్తే... గిన్నిస్ రికార్డు! డేవిడ్ రష్ గంటలో 415 విమానాలు మడిచి ఎగరేశారు! బోయిస్లోని వైఎంసీఏ రాకెట్బాల్ కోర్టు ఈ వింత రికార్డుకు వేదికైంది.
అయితే ఒక్కో విమానం మడిస్తే సరిపోదు. గిన్నిస్ రూల్స్ ప్రకారం ప్రతి విమానానికీ కచ్చితంగా ఏడు మడతలు ఉండాలి. పైగా మడిచిన విమానం నిర్దేశించిన దూరం ఎగరాలి! అందుకే రష్కు సాయం చేసేందుకు ప్రత్యేక టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఒకరు కాగితాలు అందిస్తే, ఇంకొకరు తయారైన విమానాలను తీసుకెళ్లారు. మరొకరు అవి నిర్దేశించిన దూరం ఎగిరాయో లేదో పరిశీలించారు.
అలా కేవలం 60 నిమిషాల్లో 415 విమానాలు! అంటే ఒక్కో విమానానికి సగటున 8.67 సెకన్లు! ఇప్పటికే 200కు పైగా గిన్నిస్ రికార్డులు తన ఖాతాలో వేసుకున్న రష్ ఇక్కడితో ఆగడం లేదు. విమానం మడిచి, ఎగరేయడానికి ప్రస్తుతం ఉన్న 4.54 సెకన్ల రికార్డుపై కూడా కన్నేశారు. త్వరలోనే దాన్నీ బద్దలు కొడతానని రష్ చెప్పారు.
ఇదీ చదవండి: పాదాల దుర్వాసన... 10ఏళ్ల న్యాయపోరాటం! కోర్టు ఏం చెప్పిందంటే?


