ఈ తప్పులు చేస్తున్నారా? కూరగాయలను ఇలా ఉడికించండి! | how to cook vegetables in healthy way | Sakshi
Sakshi News home page

ఈ తప్పులు చేస్తున్నారా? కూరగాయలను ఇలా ఉడికించండి!

Oct 3 2026 5:59 PM | Updated on Oct 3 2026 6:08 PM

how to cook vegetables in healthy way

కూరగాయలలో విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్లు  పుష్కలంగా లభిస్తాయి. కానీ ఆయా కూరల్లోని పోషకాలు విటమిన్లు పూర్తిగా మనకు లభించాలంటే ఎలా వండాలో తెలుసా? ముఖ్యమైన పోషకాలను కాపాడు కోవాలంటే, తక్కువ నీటితో తక్కువ సమయంలో వంటడంతోపాటు ఆవిరి మీద ఉడికించడం, మైక్రోవేవ్  చేసుకోవడం ఉత్తమం. 

మన ప్లేట్‌లో పోషకాలు ఉండాలంటే.. మంచి పదార్థాలు ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, వాటిని సరైన పద్ధతిలో వండటం కూడా అంతే ముఖ్యం. 

కూరగాయలను ఎక్కువసేపు అధిక వేడి మీద ఉడికించకూడదు. దీనివల్ల విటమిన్ల పరిమాణం తగ్గవచ్చు. అందుకే కూరగాయలను అవసరమైనంత మాత్రమే ఉడికించడం మంచిది. ఆవిరితో ఉడికించడం లేదా తక్కువ సమయంలో తక్కువ నీటితో వండడం వంటి పద్ధతుల వల్ల పోషకాలు కోల్పోకుండా ఉంటుంది.

ఆపిల్, బంగాళాదుంప, దోసకాయ వంటి కొన్ని పండ్లు, కూరగాయల తొక్కల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఇతరపోషకాలు ఉండొచ్చు. అందుకే తినదగిన తొక్క ఉన్న ఆహారాన్ని అవసరం లేకుండా పూర్తిగా ఒలిచేయడం వల్ల కొంత పోషక విలువలు కోల్పోయే అవకాశం ఉంది. అయితే తొక్కతో తినే ముందు వాటిని శుభ్రంగా కడగడం తప్పనిసరి.

కొంతమంది ఆహారాన్ని పదేపదే వేడి చేస్తుంటారు. ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల విటమిన్లు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని ఒకేసారి ఎక్కువ ఆహారం వండి పదేపదే వేడి చేయడం కంటే అవసరమైనంత మాత్రమే వంట చేసుకోవడం మంచిది.  ∙కొంతమంది కూరగాయలను నీటిలో ఉడికించి ఆ నీటిని పరాబోస్తుంటారు. దానివల్ల పోషకాలు వృథా అవుతాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement