వీక్లీ పోల్‌లో బీటీఎస్‌ ప్రభంజనం.. | BTS's Brand New Digital Single Come Over Wins By A Huge Margin | Sakshi
Sakshi News home page

వీక్లీ పోల్‌లో బీటీఎస్‌ ప్రభంజనం..

Jun 20 2026 8:18 AM | Updated on Jun 20 2026 8:18 AM

BTS's Brand New Digital Single Come Over Wins By A Huge Margin

గ్లోబల్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ‘కమ్‌ ఓవర్‌’

అంతర్జాతీయ పాప్‌ సంగీత ప్రపంచంలో కొరియన్‌ బ్యాండ్‌

బీటీఎస్‌ సరికొత్త డిజిటల్‌ సింగిల్‌ ‘కమ్‌ ఓవర్‌’ భారీ మెజారిటీ

అంతర్జాతీయ పాప్‌ సంగీత ప్రపంచంలో కొరియన్‌ బ్యాండ్‌ ‘బీటీఎస్‌’ మరోసారి తన సత్తా చాటుకుంది. బిల్‌బోర్డ్‌ నిర్వహించిన అత్యంత ప్రజాదరణ పొందిన కొత్త సంగీతం పోల్‌లో బీటీఎస్‌ సరికొత్త డిజిటల్‌ సింగిల్‌ ‘కమ్‌ ఓవర్‌’ భారీ మెజారిటీతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

జూన్‌ 12 న పారంభమైన ఈ పోలింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీటీఎస్‌ అభిమానులు భారీగా ఓట్లు వేయడంతో, ఏకంగా 86 శాతానికి పైగా ఓట్లతో ఈ పాట క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ రేసులో హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ ఒలివియా రోడ్రిగో, జాక్‌ వైట్, బెబే రెక్సా, కాట్సే వంటి దిగ్గజ కళాకారుల కొత్త ఆల్బమ్‌లు పోటీలో ఉన్నప్పటికీ, బీటీఎస్‌ క్రేజ్‌ ముందు అవేవీ నిలవలేకపోయాయి. ఫలితంగా ‘కమ్‌ ఓవర్‌’ ఒకేపక్షంగా ల్యాండ్‌స్లైడ్‌ విజయాన్ని నమోదు చేసింది. రెండవ స్థానంలో ప్రముఖ పాప్‌ సింగర్‌ ఒలివియా రోడ్రిగో విడుదల చేసిన ‘యూ సీమ్‌ ప్రెట్టీ శాడ్‌ ఫర్‌ ఎ గర్ల్‌ సో ఇన్‌ లవ్‌’ ఆల్బమ్‌ నిలిచింది.

‘కమ్‌ ఓవర్‌’ అనేది బీటీఎస్‌ గతంలో విడుదల చేసిన ‘అరిరంగ్‌’ ఆల్బమ్‌కు సంబంధించిన బోనస్‌ ట్రాక్‌. ఇప్పటివరకు కేవలం ఫిజికల్‌ డీలక్స్‌ వినైల్‌ ఎడిషన్‌ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సాంగ్‌ను, బీటీఎస్‌ వార్షిక వేడుక ‘ఫెస్టా’ సందర్భంగా అధికారికంగా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లోకి విడుదల చేశారు. కొరియన్, ఇంగ్లీష్‌ భాషల కలయికతో సాగే ఈ సాంగ్‌.. దూరమైన ్రపాణస్నేహితుడిని లేదా ప్రియమైన వారిని తిరిగి కలుసుకోవాలనే ఆరాటాన్ని, పశ్చాత్తాపాన్ని ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. బీటీఎస్‌ సభ్యులైన ఆర్‌ఎమ్, సుగా, జె–హోప్‌ స్వయంగా ఈ పాట నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం గ్లోబల్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ‘కమ్‌ ఓవర్‌’ స్ట్రీమింగ్‌ రికార్డులను తిరగరాస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement