breaking news
BTS
-
బీటీఎస్ స్టార్ ప్రాణహాని వ్యాఖ్యలు.. అభిమానుల ఆందోళన
సియోల్: దక్షిణ కొరియా పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ (BTS) సభ్యుడు జంగ్‌కుక్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగేళ్ల విరామం తర్వాత తమ కొత్త ఆల్బమ్ ‘అరిరంగ్’ (Arirang) విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, జంగ్‌కుక్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీవర్స్ (Weverse) ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభమైన ఈ ప్రత్యక్ష ప్రసారం దాదాపు 88 నిమిషాల పాటు సాగింది.ఆ సమయంలో జంగ్‌కుక్ మద్యం సేవిస్తూ, తన స్నేహితులతో కలిసి పాటలు పాడుతూ కనిపించారు. అయితే, ఆ వీడియోలో ఆయన ప్రదర్శించిన భావోద్వేగ స్థితి, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ లైవ్ సెషన్లో జంగ్‌కుక్ మాట్లాడుతూ.. ‘నన్ను ఇష్టపడని వారు, నా ఎదుగుదలను అడ్డుకోవాలని చూసే వారు ఉండొచ్చు.. కొందరైతే నన్ను చంపాలని కూడా అనుకుంటున్నారు. కానీ అందులో తప్పేముంది? నేను వాటి గురించి పట్టించుకోను’ అని ఆయన వ్యాఖ్యానించారు. లైవ్ వీడియోల విషయంలో తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోదలుచుకోలేదని, తన మనసుకు నచ్చినట్టు, స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. this korean man translated what jungkook said here and I’m shocked.. “people who want to k*** me”, he’s getting death threats??? oh my god this is so fucked up I’m speechless pic.twitter.com/fzb3JqwvQ5— jungkook ♥︎ (@ianadmirer) February 26, 2026ఈ క్రమంలో తన మేనేజ్మెంట్ సంస్థ (BigHit) గురించి కూడా ప్రస్తావిస్తూ, ఇకపై కంపెనీ నిబంధనల గురించి తనకు చింత లేదని, తన ఇష్టప్రకారం బతుకుతానని జంగ్‌కుక్ చెప్పారు. తన ధూమపాన అలవాటుపై కూడా జంగ్‌కుక్ మాట్లాడారు. ప్రస్తుతం తాను ధూమపానం చేయడం లేదని, ఎంతో కష్టపడి ఆ అలవాటును మానుకున్నానని వెల్లడించారు. 30 ఏళ్ల వయసులో ఉన్న తాను ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటంలో తప్పేమీ లేదని భావిస్తున్నప్పటికీ, తాను ఏ విషయం మాట్లాడినా కంపెనీ వారు పెద్ద రభస చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వీడియో వీవర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి తొలగించబడినప్పటికీ, దానికి సంబంధించిన క్లిప్పింగ్‌లు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రాణహాని గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కొరియన్ మీడియా కంటే అంతర్జాతీయ అభిమానులే ఎక్కువగా స్పందిస్తున్నారు. స్థానిక మీడియా ఆయన అలవాట్లను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తోందని, కానీ ఆయన మానసిక ఆరోగ్యం, భద్రతను విస్మరిస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ, బీటీఎస్ గ్రూప్ మార్చి 20న వారి కొత్త స్టూడియో ఆల్బమ్ ‘అరిరంగ్’ను విడుదల చేయనుంది. సైనిక సేవ పూర్తి చేసుకున్న తర్వాత సభ్యులందరూ కలిసి పాల్గొనే మొట్టమొదటి గ్లోబల్ కాన్సర్ట్ ‘బీటీఎస్ ది కమ్ బ్యాక్ లైవ్ అరిరంగ్’ మార్చి 21న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్త ఆర్మీ (BTS Fans) వేచి చూస్తున్న తరుణంలో, జంగ్‌కుక్ వ్యాఖ్యలు ఈ వేడుకలపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు ఆమెకే? -
మాస్ అండ్ క్లాస్: సంగీత ప్రపంచంలో బీటీఎస్ శాసనం
సంగీతానికి భాషా సరిహద్దులు లేవని ప్రపంచానికి ‘పాప్ మ్యూజిక్’ చాటిచెబుతోంది. వెస్ట్రన్ మ్యూజిక్ హవా నడుస్తున్న తరుణంలో, దక్షిణ కొరియాకు చెందిన ఏడుగురు కుర్రాళ్లు ‘బీటీఎస్’ (బాంగ్తాన్ సోన్యోందన్) పేరుతో ప్రపంచ సంగీత పటాన్ని ఒక్కసారిగా మార్చేశారు. కేవలం తమ పాటలతోనే కాకుండా, తమ అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ, సామాజిక సందేశాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. బీటీఎస్ ఆర్మీ పేరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుని తిరుగులేని గ్లోబల్ ఫోర్స్‌గా ఎదిగారు. గ్రామీ నామినేషన్లు మొదలు ఐక్యరాజ్యసమితి వేదికల వరకు ‘కే పాప్’ స్థాయిని అమాంతం పెంచారు. 7 కోట్ల 80 లక్షల ఫాలోవర్స్కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా ఈ బృందం ఒకేసారి రెండు చారిత్రాత్మక విజయాలను నమోదు చేసి ప్రపంచాన్ని తెగ ఆశ్చర్యపరిచింది. హంటెయో మ్యూజిక్ అవార్డ్స్ 2025లో ‘గ్లోబల్ పాపులర్ ఆర్టిస్ట్’ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా, సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌లో 78 మిలియన్ల(7 కోట్ల 80 లక్షలు) ఫాలోవర్లను సాధించిన తొలి మ్యూజిక్ గ్రూపుగా అరుదైన మైలురాయిని చేరుకుంది.హంటెయో అవార్డుతో గుర్తింపుసంగీత రంగంలో అత్యంత ఉన్నత అవార్డులలో హంటెయో మ్యూజిక్ అవార్డ్స్ ఒకటి. 2025 సంవత్సరానికి గాను బీటీఎస్ ‘గ్లోబల్ పాపులర్ ఆర్టిస్ట్’ కేటగిరీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆల్బమ్ విక్రయాలు, డిజిటల్ స్ట్రీమింగ్ గణాంకాలు, అభిమానుల భాగస్వామ్యం ఆధారంగా బీటీఎస్‌ను విజేతగా ప్రకటించారు. ఈ అవార్డు వారు సృష్టించిన రికార్డులకు ఒక ఉదాహరణగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో తిరుగులేని ఆధిపత్యంఅవార్డుల ప్రకటన వెలువడిన కాసేపటికే ఇన్స్టాగ్రామ్ వేదికగా మరో భారీ రికార్డు బద్దలైంది. బీటీఎస్ అధికారిక ఖాతా 78 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఏ మ్యూజికల్ బ్యాండ్ కూడా ఇప్పటివరకు ఈ స్థాయి ఫాలోయింగ్‌ను దక్కించుకోలేదు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి.. ఏకైక గ్రూపుగా బీటీఎస్ సరికొత్త రికార్డును లిఖించింది. ఇది బీటీఎస్ గ్లోబల్ క్రేజ్‌కు అద్దం పడుతోంది.మిలిటరీ సర్వీస్ తర్వాత..బీటీఎస్ సభ్యులైన జిన్, సుగా, జె-హోప్, ఆర్ఎమ్, జిమిన్, వీ, జంగ్‌కుక్ తమ తప్పనిసరి మిలిటరీ సేవలను పూర్తి చేసుకుని మళ్లీ ఒకే వేదికపైకి రానుండటం అభిమానులను ఆనందంలో మంచెత్తుతోంది. బీటీఎస్ సభ్యులంతా కలిసి పూర్తి స్థాయి బృందంగా తిరిగి రావడం అనేది బీటీఎస్‌లో భారీ మార్పులకు సంకేతం కానుంది. ఈ పునరాగమనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు వేల కళ్లతో ఎదురుచూస్తున్నారు.మార్చి 20న ‘అరిరంగ్’ ఆల్బమ్ విడుదలదాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత బీటీఎస్ తమ ఐదవ స్టూడియో ఆల్బమ్ ‘అరిరంగ్’ను 2026, మార్చి 20న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఆల్బమ్‌లో మొత్తం 14 ట్రాక్‌లు ఉండనున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ ఆల్బమ్‌పై సామాజిక మాధ్యమాల్లో భారీ చర్చ నడుస్తోంది. ఈ ఆల్బమ్ ద్వారా సంగీత చార్టుల్లో పాత రికార్డులన్నీ కనుమరుగవుతాయని అభిమానులు అంటున్నారు.ప్రపంచవ్యాప్త పర్యటనకు..ఈ ఆల్బమ్ విడుదలైన వెంటనే ఏప్రిల్ 9 నుండి బీటీఎస్ తమ ‘వరల్డ్ టూర్ 2026-2027’ను ప్రారంభించనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 34 ప్రధాన నగరాల్లో మొత్తం 81 లైవ్ షోలను నిర్వహించనున్నారు. సభ్యుల లైవ్ పెర్ఫార్మెన్స్ను చూసేందుకు టికెట్ల కోసం ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ బృందం భారత్‌లోని ముంబైలో పర్యటించనున్నదనే వార్త కూడా వినిపిస్తోందిగ్లోబల్ ఐకాన్స్‌గా బీటీఎస్సంగీతం, ఫ్యాషన్, సామాజిక అంశాలపై బీటీఎస్ చూపిస్తున్న ప్రభావం అంతకంతకూ పెరిగిపోతోంది. కేవలం ఒక పాప్ బ్యాండ్‌గా మాత్రమే కాకుండా, ఒక గ్లోబల్ బ్రాండ్‌గా వారు ఎదిగిన తీరు అమోఘమని సంగీతాభిమానులు అంటున్నారు. రాబోయే ‘అరిరంగ్’ ఆల్బమ్, వరల్డ్ టూర్‌తో 2026 ఏడాదంతా బీటీఎస్ స్మరణతో నిండిపోనున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ‘అమెరికాతో యుద్ధం వచ్చినా..’..ఇరాన్ కీలక ప్రకటన -
‘ఒకరు సంచులు మోస్తే.. మరొకరు చెప్పులు మోస్తారు’
హైదరాబాద్: రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు ఢిల్లీ పార్టీల్లో ఒకటి సంచుల పార్టీ అయితే, మరొకటి చెప్పులు మోసే పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్.గతంలో కేసీఆర్ నాయకత్వంలో ఏప్రిల్, మే నెలల్లో కూడా మానేరు ఓ సజీవధారగా ప్రవహించదన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక చిన్న పర్రె పడితే బద్నాం చేశారని బీజేపీ, కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఎస్ఎల్పీసీలో ఎనిమిది చనిపోతే, సుంకిశాల కూలిపోతే ఎన్డీఎస్ఏ ఎందుకు రాదని ప్రశ్నించారు.భూకంపం వచ్చినా తట్టుకుని నిలబడింది కాళేశ్వరమని, మేడిగడ్డకు ఇప్పటికైనా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్ సీయూ భూములపై స్వయానా కుదవ పెడితే.. మరో మంత్రేమో ఏం లేదంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మీదీ కాని భూమిని తనఖా పెట్టడం తప్పు కాదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
'ఛావా'.. తెర వెనక ఇంత కష్టపడ్డారా?
గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన మూవీ 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే రూ.600 కోట్ల మేర వసూళ్లు సాధించింది. తెలుగులోనూ రూ.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)దాదాపు నెలరోజుల నుంచి థియేటర్లలో అద్భుతంగా ప్రదర్శితమవుతున్న 'ఛావా' క్లైమాక్స్ బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో విక్కీ రిహార్సల్ చేయడం, ప్రొస్థటిక్ మేకప్ లాంటివి చూపించారు. ఇదంతా చూస్తున్నప్పుడు సినిమా కోసం ఇంతలా కష్టపడ్డారా అనిపించకమానదు.(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత) -
టాప్ టెన్ మోస్ట్ పాపులర్ కె-పాప్ గ్రూప్స్ (ఫోటోలు)
-
బీటీఎస్ బ్యాండ్ బాయ్స్‌కి గడ్డం ఉంటే.. ఎలా ఉంటుందో చూడండి..
-
'దసరా' మూవీ షూటింగ్ ఎలా జరిగిందో తెలుసా? వీడియో రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దసరా' మాస్ మేనియా కనిపిస్తుంది. నేచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతుంది. విడుదలైన తొలిరోజు నుంచే హిట్ టాక్‌ను తెచ్చుకొని బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే దసరా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి అదరగొడుతుంది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లోనూ దసరా పాటలు, డైలాగ్స్ మోత మోగుతోంది. సినిమా సూపర్ హిట్ కావడంతో రీసెంట్గా కరీంనగర్లో సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే దసరా మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. పవ్వ తాగడం, సిల్క్ బార్ దగ్గర్నుంచి క్లైమాక్స్ షాట్స్ వరకు మేకింగ్ వీడియోను వదిలారు. మీరూ చూసేయండి మరి. -
పాపులర్ బిటిఎస్ బాయ్ నోట మన తెలుగు పాట.. వీడియో వైరల్
కొరియన్ బిటిఎస్ బాయ్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యూజిక్ బ్యాండ్‌కి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి వీడియోలే దర్శనం ఇస్తాయి. ఈ బిటిఎస్ బ్యాండ్‌లోని బాయ్స్‌కు ఉండే లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలంటూ కుప్పలు తెప్పలుగా వారికి రిక్వెస్ట్స్ వస్తుంటాయట. ఇదిలా ఉంటే ఈ బిటిఎస్ బ్యాండ్‌కు చెందిన ఓ సింగర్ మన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ అంటే చాలా ఇష్టమట. చదవండి: తెలియక ఆ తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు అవి తెలుసుకున్నా: రష్మీ తాజాగా అతడు ఆ పాటకు హమ్ చేస్తూ స్టెప్పులు వేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకి ఆ సింగర్ ఎవరంటే అమ్మాయిల రాకుమారుడైన జంగ్ కూక్. రీసెంట్గా జంగ్ కూక్ నాటు నాటు పాట వింటూ ఆ పాటను స్వయంగా ఆలిపించాడు. అయితే ఈ పాటను తెలుగులోనే విని పాడటం విశేషం. పాడటంమే కాదే నాటు నాటు సిగ్నేచర్ స్టేప్ కూడా వేశాడు. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. అనంతరం ఈ పాట తనని ఎంతగా ఆకట్టుకుందో కూడా వివరించిన వీడియోను తన యూట్యూబ్ చానల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం వీడియోకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన బిటిఎస్ బ్యాండ్ సింగర్ స్వయంగా నాటు నాటు పాడటం చూసి తెలుగు అభిమానులంతా మురిసిపోతున్నారు. అంతేకాదు ఈ వీడియోను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక జంగ్ కూక్ నాటు నాటు పాట పాడిన అనంతరం ప్రస్తుతం ఈ పాట, ఆర్ఆర్ఆర్ సౌత్ కొరియాలో ట్రెండింగ్‌లో నిలిచిందని సమాచారం. -
పాప్ బ్యాండ్ బీటీఎస్‌తో బైడెన్ భేటీ : వీడియో వైరల్
Biden says it was great to meet BTS: దక్షిణ కొరియా పాప్ బ్యాండ్ సూపర్ గ్రూప్ బీటీఎస్ బృందం అమెరికా శ్వేతసౌధంలో అధ్యక్షుడు జో బైడెన్‌తో సమవేశమైంది. ఈ సమావేశంలో ఆసియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు, వివక్షత తదితర అంశాలకు సంబంధించిన పరిష్కారమార్గాల గురించి చర్చించారు. ఈ మేరకు పాప్ బృందం బైడెన్‌ని కలవడం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఆసియా వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు, వివక్ష పెరుగుదల గురించి అవగాహన పెంచడానికి బైడెన్ చేస్తున్న కృషిని ప్రశంసించింది. కరోనాకి సంబంధించిన ద్వేష పూరిత నేరాల చట్టంపై సంతంకం చేయడం వంటి బైడెన్ నిర్ణయాలను పాప్ బృందం కొనియాడింది. గత కొంతకాలంలో వైట్‌హౌస్‌లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు బైడెన్ చేస్తున్న కృషిని అభినందించడమే కాకుండా తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తామని తెలిపింది. ఈ మేరకు శ్వేతసౌధంలో జరిగిన సమావేశానాకి సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. It was great to meet with you, @bts_bighit. Thanks for all you’re doing to raise awareness around the rise in anti-Asian hate crimes and discrimination. I look forward to sharing more of our conversation soon. pic.twitter.com/LnczTpT2aL — President Biden (@POTUS) June 1, 2022 (చదవండి: అందుకే ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధ సాయం: ఎట్టకేలకు బైడెన్ కీలక ప్రకటన) -
BTS Butter Music Video: గంటలో రికార్డులు బద్ధలు!
'బీటీఎస్'... వరల్డ్ వైడ్‌గా పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ బ్యాండ్. ఇండియాలోనూ ఈ గ్రూప్‌కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏడుగురు సౌత్ కొరియన్ బాయ్స్‌తో ఉండే ఈ గుంపు.. పాప్ ప్రపంచంలో ఓ ప్రభంజనం. కొరియా నుంచి మొదలై జపాన్, అమెరికా.. ఇలా వరుస దేశాల్లో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ.. ఇంటర్నేషనల్ సెన్సేషన్‌గా మారింది. వీళ్ల ఆల్బమ్స్ మిలియన్ల కొద్దీ కాపీల్ని అమ్ముడు పోతుంటాయి. రీసెంట్గా ట్విట్టర్, యూట్యూబ్‌లతో అదిరిపోయే రికార్డులతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది బీటీఎస్. బీటీఎస్ లేటెస్ట్ ఆల్బమ్ ‘బటర్’ శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అయిన కాసేపటికే రికార్డుల మోత మొదలైంది. సాంగ్ లాంచ్ లైవ్‌ను 3.89 మిలియన్ల మంది యూట్యూబ్ ప్రీమియర్‌లో వీక్షించగా, కేవలం పదమూడు నిమిషాల్లోనే కోటి మంది యూట్యూబ్‌లో ఈ ఆల్బమ్‌ను చూశారు. 54 నిమిషాల్లో రెండు కోట్ల మంది వీక్షించడం కూడా యూట్యూబ్‌లో ఓ రికార్డే. ఇది వరకు ఈ రికార్డు బీటీఎస్ వాళ్ల ‘డైనమైట్’ ఆల్బమ్ పేరిటే ఉండేది. ఇక నాలుగు గంటల్లో యూట్యూబ్‌లో 37 మిలియన్ల వ్యూస్ దాటేసి దూసుకుపోతోంది బటర్. ఇది బీటీఎస్కి రెండో ఇంగ్లీష్ సింగిల్ ఆల్బమ్. ఇంకోవైపు వరల్డ్‌వైడ్‌గా బటర్‌కి సంబంధించిన హ్యాష్‌ట్యాగులు ట్విట్టర్లో టాప్ ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి.


