పాప్‌ బ్యాండ్‌ బీటీఎస్‌తో బైడెన్‌ భేటీ : వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

Viral Video: పాప్‌ బ్యాండ్‌ బీటీఎస్‌తో సమావేశమైన బైడెన్‌: వీడియో వైరల్‌

Published Wed, Jun 1 2022 12:29 PM

US President Joe Biden Met With South Korean K Pop Band BTS - Sakshi

Biden says it was great to meet BTS: దక్షిణ కొరియా పాప్‌ బ్యాండ్‌ సూపర్‌ గ్రూప్‌ బీటీఎస్‌ బృందం అమెరికా శ్వేతసౌధంలో అధ్యక్షుడు జో బైడెన్‌తో సమవేశమైంది. ఈ సమావేశంలో ఆసియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు, వివక్షత తదితర అంశాలకు సంబంధించిన పరిష్కారమార్గాల గురించి చర్చించారు. ఈ మేరకు పాప్‌ బృందం బైడెన్‌ని కలవడం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఆసియా వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు, వివక్ష పెరుగుదల గురించి అవగాహన పెంచడానికి బైడెన్‌ చేస్తున్న కృషిని ప్రశంసించింది.

కరోనాకి సంబంధించిన ద్వేష పూరిత నేరాల చట్టంపై సంతంకం చేయడం వంటి బైడెన్‌ నిర్ణయాలను పాప్‌ బృందం కొనియాడింది. గత కొంతకాలంలో వైట్‌హౌస్‌లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు బైడెన్‌ చేస్తున్న కృషిని అభినందించడమే కాకుండా తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తామని తెలిపింది. ఈ మేరకు శ్వేతసౌధంలో జరిగిన సమావేశానాకి సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: అందుకే ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధ సాయం: ఎట్టకేలకు బైడెన్‌ ​కీలక ప్రకటన)

Advertisement
 
Advertisement
 
Advertisement