హాట్‌ కేకుల్లా బీటీఎస్‌ టికెట్ల అమ్మకాలు | BTS announce 2026-2027 world tour | Sakshi
Sakshi News home page

హాట్‌ కేకుల్లా బీటీఎస్‌ టికెట్ల అమ్మకాలు

Jun 11 2026 9:24 PM | Updated on Jun 11 2026 9:24 PM

BTS announce 2026-2027 world tour

జకర్తా: ఈ తరం యువతను ఉర్రూతలూగించే కొరియన్‌ పాప్‌ బృందం నిర్వహించనున్న ఈవెంట్‌ పాస్‌లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. కేవలం 20 నిమిషాల్లోనే ఐదు లక్షల పాసులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. 

కొరియన్‌ పాప్‌ బృందం బీటీఎస్‌ వరల్డ్‌ టూర్‌లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్‌ 26, 27 తేదీలలో జకార్తాలోని గెలోరా బుంగ్ కర్నో క్రీడా మైదానంలో మ్యూజిక్‌ కన్సర్ట్‌  నిర్వహించనుంది. తొమ్మిదేళ్ల తర్వాత బీటీఎస్‌ సంపూర్ణ బృందంగా ఇండోనేషియాలో తొలిసారి ప్రదర్శన ఇవ్వనుంది.

ఈ కార్యక్రమం కోసం జూన్‌ 9న బీటీఎస్‌ బృం‍దం టికెట్స్‌ను ప్రీసేల్‌ నిర్వహించింది. ప్రీసేల్‌లో పాస్‌లను సొంతం చేసుకునేందుకు ఐదు లక్షలకు పైగా అభిమానులు ఆన్‌లైన్‌లో పోటెత్తారు. అయితే ఈ టికెట్లు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి. జూన్‌ 11న మధ్యాహ్నం 12 గంటలకు సాధారణ సేల్‌ ప్రారంభమైనమూడు గంటల్లోపే ముగిశాయి. ఒక నివేదిక ప్రకారం, ఇవి 12 నిమిషాల ముందే పూర్తయ్యాయి.

బీటీఎస్‌ ఈవెంట్‌ టికెట్లు టికెట్‌.కామ్‌లో విక్రయించారు. వీఐపీ ఎంట్రన్స్‌ పాస్‌ ధర రూ.4.5 లక్షల ఇండోనేషియా రూపాయల వరకు ఉంది. బీటీఎస్‌ ఈవెంట్‌ టికెట్లు అధికారికంగా నిర్ణయించిన ధరకు అమ్ముడైన వెంటనే, కొంతమంది వాటిని రీసేల్‌ మార్కెట్‌లో అసలు ధర కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు మళ్లీ విక్రయించడం ప్రారంభించారు. రీసేల్‌ మార్కెట్లో టికెట్‌ ధరలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement