కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్‌ గర్ల్‌ని గుర్తు పట్టారా? వైరల్‌ వీడియో | Bajrangi Bhaijaan Munni recreates Heeramandi Alamzeb viral video | Sakshi
Sakshi News home page

కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్‌ గర్ల్‌ని గుర్తు పట్టారా? వైరల్‌ వీడియో

May 16 2024 8:50 PM | Updated on May 16 2024 10:22 PM

Bajrangi Bhaijaan Munni recreates Heeramandi Alamzeb viral video

మాస్ట్రో సంజయ్‌ లీలా బన్సాలీ  హీరామండి: ది డైమండ్‌ బజార్‌తో డిజిటల్‌ ప్రపంచంలోకి ఆకట్టుకునేలా అడుగుపెట్టాడు.  సంచలన టీవీ సిరీస్‌తో సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతున్నాడు. పలువురు నటీమణులు తమ అద్బుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా వీటన్నింటికి మించి  గోల్డెన్‌ గర్ల్‌  వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


హర్షాలీ మల్హోత్రా మెస్మరైజింగ్‌ పెర్ఫార్మెన్స్‌
సల్మాన్‌ ఖాన్‌  బ్లాక్‌ బస్టర్‌ ‘‘బజరంగీ భాయిజాన్‌’’లో  మున్నీ పాత్రలో నటించి, ప్రశంసలందుకున్న హర్షాలీ మల్హోత్రా లేటెస్ట్‌ సంచలనం. హీరామండిలోని అలంజేబ్‌ పాత్రను రీక్రియేట్‌ చేసింది. ఇందులో  తనదైన నటనతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.

 ఈ ధారావాహికలోని ‘‘ఏక్‌ బార్‌ దేఖ్‌ లిజియే’’ పాటకు తనదైన అభియనంతో వీడియోను ఇన్‌స్టాలో  పోస్ట్‌  చేసింది.  గోల్డెన్‌ కలర్‌ లెహంగాలో మల్హోత్రా మెరిసిపోయింది. అందమైన ఆమె కళ్ళు అనేక భావోద్వేగాలను అలవోకంగా పలికించడం విశేషం.  దీంతో ఒరిజినల్‌ సాంగ్‌తో పోలిస్తే మల్హోత్రా బాగా నటించిందంటూ అంతా  కితాబిచ్చారు.

1940లలోని భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యానికి వ్యతిరేకంగా, ‘‘హీరామండి’’ లాహోర్‌లోని రెడ్‌-లైట్‌ డిస్ట్రిక్ట్‌ హీరా మండిలో తవాయిఫ్‌ల (వేశ్యల) జీవితాల చుట్టూ ఈ సిరీస్‌ తిరుగుతుంది. స్టార్‌-స్టడెడ్‌ సిరీస్‌లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్‌ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్‌ అధ్యాయాన్‌ వంటి ప్రఖ్యాత నటీనటులు ఉన్నారు. ఇంకా శేఖర్‌ సుమన్‌, తహా షా బదుషా, ఫరీదా జలాల్‌తదితరులు మరికొందరు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో వెబ్‌ సిరీస్‌ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన షోగా  నిలిచిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement