
హైదరాబాద్: తలసేమియా లేని భారత్ తమ లక్ష్యంతో బ్లడ్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది. “భారతదేశాన్ని తలసేమియా నుండి విముక్తి చేయడం తమ లక్ష్యమనీ రోగులకు సమయానికి రక్తం అందించడం, కొత్త కేసులు రాకుండా తక్కువ ఖర్చుతో స్క్రీనింగ్ చేయించడం ద్వారానే ఇది సాధ్యమని వ్యవస్థాపకుడు కృష్ణ వంశీ వెల్లడించింది. గతంలో పోలియో నిర్మూలన చేసినట్లు, మనం కలసికట్టుగా కృషి చేస్తే తలసేమియాను కూడా నిర్మూలించవచ్చని ఆయన తెలిపారు.
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రముఖ లౌంజ్ అండ్ పబ్ అకాన్ సౌజన్యంతో బ్లడ్ వారియర్స్‌కు నిధుల సేకరణ కోసం అకాన్ ఆహ్వానం కార్యక్రమం నిర్వహించింది. రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పౌరులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. తలసేమియా లేని భారత నిర్మాణానికి మద్దతుగా ఈ సందర్భంగా అందరూ ప్రతిన బూనారు.

అకాన్ వ్యవస్థాపకుడు నిహాల్ రెడ్డి గుర్రాల మాట్లాడుతూ.. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనతో అకాన్ ఆహ్వానం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజాన్ని చైతన్యపరచి, కలసికట్టుగా చర్యలు తీసుకునేలా చేస్తాయని కృష్ణ వంశీ అభిప్రాయపడ్డారు. బ్లడ్ వారియర్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కొత్తగూడెం–భద్రాచలంను దేశంలోనే తొలి తలసేమియా రహిత జిల్లాగా మార్చాలని సంకల్పించినట్టు చెప్పారు.