విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
నరసాపురం రూరల్: క్రిస్మస్ వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని సీతారామపురంసౌత్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సీతారామపురం వెంకట్రావుతోటలో శుక్రవారం రాత్రి జరుగనున్న క్రిస్మస్ వేడుకలకు సంబంధించి విద్యుత్ దీపాలను అలంకరించే పనులు చేస్తుండగా శీలం అభిరామ్ (19) అనే యువకుడికి 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో కిందపడ్డాడు. వెంటనే బాధితుడిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాలకొల్లు మండలంలోని దిగమర్రు గ్రామానికి చెందిన వీరి కుటుంబం కొంతకాలంగా మొగల్తూరు మండలంలోని జెట్టిపాలెం గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్దనే ఉంటున్నారు. మృతుని తల్లిదండ్రులు ఇరువురూ ఉపాది నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. తల్లి నెల రోజులక్రితమే విదేశాలకు వెళ్లింది. మృతుని సోదరుడు సాయి శరత్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని మొగల్తూరు ఎస్సై వై నాగలక్ష్మి తెలిపారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): నగరంలోని అభినయ నృత్యభారతి 30వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం జాతీయ నృత్యోత్సవాలు, నృత్య పోటీలు నిర్వహించారు. స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన యువ నర్తకులు రాత్రి మానిక్ మణిపురి నృత్యం, కొప్పరపు సౌజన్య కూచిపూడి , శ్రీవల్లి కథక్ నృత్యం, దేబంజనా బిస్వాస్ గౌడియా నృత్యం, సంజన కూచిపూడి నృత్యం, బిజినా సురేంద్రనాధ్ మోహినియాట్టం వంటి భారతీయ సాంప్రదాయ నత్యాలు ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. వీరికి సంస్థ తరఫున నృత్యకౌముది అవార్డులు అందించారు. వీరికి అంబికా రాజా, కానాల శ్రీనివాస్, లేళ్ల వెంకటేశ్వరరావు, దువ్వి రామారావు, నాట్యాచార్య దువ్వి హేమసుందర్ పత్రాలు అందించారు. కార్యక్రమంలో కళారత్న కేవీ సత్యనారాయణ, నందుల రమణి, పోడూరి కనక దుర్గ, రావి పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి


