పాలకొల్లులో సినిమా షూటింగ్ సందడి
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో హరి గాడి హరికథ చిత్రం నిర్మాణం షూటింగ్‌తో సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం స్థానిక యడ్లబజారు సెంటర్ వద్ద పశువులు ఆసుపత్రిలో మాంటెజ్ సాంగ్ షూటింగ్ చేశారు. సురభి ఎంటర్‌టెయిన్‌మెంట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతనంగా హరి యడ్లపల్లి, ప్రియా హెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచయిత వైవీ సర్వేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్వేష్ మాట్లాడుతూ పాలకొల్లు , అడవిపాలెం, శిరగాలపల్లి, చించినాడ, పేరుపాలెం ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 50 శాతం చిత్ర షూటింగ్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు అడ్డాల, నిర్మాత సురభి హరినాఽథరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పూజ్యం శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.


