వైద్య రంగం నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

వైద్య రంగం నిర్వీర్యం

Dec 27 2025 7:44 AM | Updated on Dec 27 2025 7:44 AM

వైద్య

వైద్య రంగం నిర్వీర్యం

ఈఓ నియామకంపై ఉత్కంఠ

న్యూస్‌రీల్‌

ఈఓ నియామకంపై ఉత్కంఠ
చినవెంకన్న దేవస్థానం కొత్త ఈఓ నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత ఈఓ ఉద్యోగ విరమణతో కొత్త ఈఓ ఎవరొస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. 8లో u
చంద్రబాబు సర్కారు పాలనలో వైద్యసేవలకు సుస్తీ చేసింది. సామాన్యుడికి ఆరోగ్య భరోసా కరువైంది. గత ప్రభుత్వ పాలనలో రూపాయి ఖర్చు లేకుండా వైద్య చికిత్సలు, సేవలు ప్రజలకు చేరువలో ఉండేవి. నేటి టీడీపీ సర్కారు పాలనలో సుస్తీ చేస్తే వైద్యం సరిగా అందని దైన్యస్థితిలో ప్రజలు అల్లాడుతున్నారు.

శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

ఏలూరు టౌన్‌: ఆరోగ్యశ్రీ పథకానికి టీడీపీ సర్కారు తూట్లు పొడుస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ సేవలు సక్రమంగా అందడం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆరోగ్య ఆసరా పేరుతో శస్త్రచికిత్సల అనంతరం ఇంటికి వెళ్ళిన రోగుల జీవనానికి ఇచ్చే ఆరోగ్య ఆసరా పథకాన్ని రద్దు చేశారు. ఆరోగ్యశ్రీలో 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకూ గత ప్రభుత్వం 20,826 మందికి వైద్యసేవలు అందించగా.. రూ.47.26 కోట్లు ఖర్చు చేసింది. నేటి టీడీపీ హయాంలో గత ఏడాది కాలంలో కేవలం 9,127 మందికి మాత్రమే సేవలు అందించగా... రూ.16.73 కోట్లు ఖర్చు చేశారు.

జీజీహెచ్‌లో వైద్యసేవలు నిల్‌

ఏలూరు సర్వజన ఆసుపత్రిలో అత్యవసర వైద్యసేవలు అందే పరిస్థితి లేదు. ప్రాణాపాయ స్థితిలో ఏలూరు జీజీహెచ్‌కు తరలిస్తే.. వెంటనే విజయవాడ, గుంటూరుకు రిఫర్‌ చేస్తూ చేతులు కడిగేసుకుంటున్నారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకపక్ష నేతలు వార్నింగ్‌ ఇచ్చినా పట్టించుకునే స్థితిలో వైద్య అధికారులు, సిబ్బంది లేరు. గుండె సంబంధిత వ్యాధుల సేవలను ప్రైవేటు హాస్పిటల్స్‌కు అప్పగించడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. ఏలూరు జీజీహెచ్‌కు సుమారు 900 నుంచి 1200 మంది రోగులు ఆయా అనారోగ్య సమస్యలతో వస్తుంటారు. కంటి విభాగం, ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ పరవాలేదు అనిపించినా మిగిలిన విభాగాల సేవలు దారుణంగా ఉన్నాయంటున్నారు.

మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ భూతం

ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో 3వ ఏడాది వైద్య విద్యార్థులు తమను ర్యాగింగ్‌ చేస్తున్నారంటూ 2వ ఏడాది వైద్య విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్స్‌, జూనియర్స్‌ మధ్య ఘర్షణ నెలకొంది. జూనియర్‌ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌ వార్డెన్‌ సైతం పట్టించుకోకపోవడంతోనే పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుందని వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. టూటౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌ సిబ్బందితో జీజీహెచ్‌లోని హాస్టల్‌కు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

వైద్య విద్యార్థినులపై ఎలుకల దాడి

జీజీహెచ్‌ ప్రాంగణంలో వైద్య విద్యార్థులకు హాస్టల్‌ ఏర్పాటు చేయగా.. గత నెలలో ఆరుగురు వైద్య విద్యార్థులపై ఎలుకల దాడితో హాస్టల్‌ నిర్వహణ లోపాలు బహిర్గమయ్యాయి. విద్యార్థినిలను ఎలుకలు కరవడంతో జీజీహెచ్‌ ఎమర్జెన్సీలో వారికి చికిత్స అందించారు.ఆరోగ్యశాఖ మంత్రి, డీఎంఈ ఉన్నతాధికారులు స్పందించి ఇద్దరు సిబ్బందిని సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్నారు.

రోడ్డెక్కిన పీహెచ్‌సీ వైద్యాధికారులు

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పీహెచ్‌సీ వైద్యాధికారులు మెరుగైన రీతిలో వైద్యసేవలు అందిస్తూ ఉంటారు. అయితే పీహెచ్‌సీ వైద్యాధికారులు రోడ్డెక్కారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తోన్న వైద్యులు విధులను బహిష్కరించారు. పీజీ సీట్లలో కోటాకు కోత వేసిన ప్రభుత్వం, గత ఏడాది ఇచ్చిన హామీని సైతం పక్కన బెట్టి పాత విధానాన్ని తెరపైకి తేవడంతో పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్‌ పిలుపుతో ఉద్యమబాట పట్టారు.

మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణాల్లో జాప్యం

ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. 2023, అక్టోబర్‌లో భవన నిర్మాణ పనులు ప్రారంభించగా.. నేటికీ సాగుతూనే ఉన్నాయి. 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.90 కోట్లతో జీ ప్లస్‌ 3 అంతస్తులతో భవన నిర్మాణం చేపట్టారు. మెడికల్‌ సర్వీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పనులు చేస్తున్నారు. ఒకవైపు ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమై మూడో ఏడాది కాగా.. నేటికీ భవనాన్ని అందుబాటులోకి తేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పటం లేదు.

ఆరోగ్యశ్రీ పథకం సేవలందక ఇక్కట్లు

పడకేసిన గ్రామీణ వైద్య సేవలు

108 అత్యవసర వాహనాలకు బ్రేకులు

ఏలూరు జీజీహెచ్‌లో వైద్యసేవలు అంతంతమాత్రం

మెడికల్‌ కాలేజీ భవనాల నిర్మాణాల్లో జాప్యం

వైద్య రంగం నిర్వీర్యం1
1/4

వైద్య రంగం నిర్వీర్యం

వైద్య రంగం నిర్వీర్యం2
2/4

వైద్య రంగం నిర్వీర్యం

వైద్య రంగం నిర్వీర్యం3
3/4

వైద్య రంగం నిర్వీర్యం

వైద్య రంగం నిర్వీర్యం4
4/4

వైద్య రంగం నిర్వీర్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement