దుస్థితిలో 108 అంబులెన్స్‌లు
ఒకప్పుడు 108కు ఫోన్ చేస్తే... క్షణాల్లో అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలు కాపాడేది. నేడు కుయ్... కుయ్ అంటూ పరుగులు పెట్టలేక కుయ్యో.. మొర్రో అంటూ కదల్లేని స్థితిలో ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఫోన్ చేస్తే.. ప్రాణాలు పోయినా రావడం లేదంటున్నారు. జిల్లాలో 28 అంబులెన్స్‌లకు గానూ ప్రజలకు అందుబాటులో ఎన్ని వాహనాలు ఉన్నాయో.. ఎవరికీ తెలియని దుస్థితి. 2023 జనవరి నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ 46,935 మంది బాధితులకు అంబులెన్స్‌లు సేవలు అందిస్తే.. ఈ ఏడాది 108 వాహనాలతో 12,698 మందికి మాత్రమే సేవలు అందడం చంద్రబాబు సర్కారు పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది.
ఏలూరు సర్వజన ఆసుపత్రి తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది, డ్రైవర్లు నిర్లక్ష్య ధోరణితో బాలింతలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జీజీహెచ్ ఎంసీహెచ్ బ్లాక్ వద్ద ఒక బాలింత తన చిన్నారితో గంటల తరబడి కూర్చున్నా.. ఎక్స్‌ప్రెస్ వాహనం రాలేదు. బాలింత చలిలో బిడ్డతో ఏడుస్తూ ఉండడంతో అక్కడి వారంతా చలించిపోయారు. మీడియాకు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి సమయంలో వాహనం డ్రైవర్ వచ్చాడు.
దుస్థితిలో 108 అంబులెన్స్‌లు


