
పాత పెన్షన్ కోసం 25న మహాధర్నా
ఏలూరు(మెట్రో)/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాత పెన్షన్ విధానం కోసం ఈనెల 25న విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని డీఎస్సీ–2003, ఉపాధ్యాయుల ఫోరం పిలుపుని చ్చింది. మహాధర్నా పోస్టర్‌ను శనివారం ఏలూ రులో జిల్లా ఎన్‌జీఓ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, జేఏసీ నాయకులు హరినాథ్, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జి.మోహన్, హెచ్‌ఎంల సంఘం నాయకులు ప్ర కాష్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారావు ఆవిష్కరించారు. రాష్ట్ర కన్వీనర్లు కేఎల్ శ్రీనాథ్, కట్టా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీపీఎస్ విధానానికి ముందు నోటిఫికేషన్లు విడుదలై, సీపీఎస్ అమలైన తర్వాత విధుల్లో చేరిన సుమారు 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం మె మో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఎన్జీఓ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో మెమో 57 ప్రకారం 16 రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ను పునరుద్ధరించారన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కన్వీనర్లు వి.జగదీష్, ఈ.శంకర్రావు, ఫోరం సభ్యులు కె.గోపాల్‌కృష్ణ, బి.శ్రీనివాసరావు, వి.శివకుమార్ పాల్గొన్నారు.