వణికిస్తున్న వరద గోదావరి | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న వరద గోదావరి

Aug 29 2025 2:42 AM | Updated on Aug 29 2025 2:42 AM

వణికి

వణికిస్తున్న వరద గోదావరి

మెట్టలో భారీ వర్షాలు

మళ్లీ నీట మునిగిన ఎద్దెల వాగు వంతెన

18 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాన్ని వరద గోదావరి వణికిస్తోంది గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత, ఇంద్రావతి పొంగి ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వైపు నుంచి వరద నీటిని విడుదల చేశారు. దీనికి తోడు సమ్మక్క సారక్క ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా భద్రాచలం వద్ద గోదారి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం రాత్రి వరద నీటిమట్టం 39 అడుగులకు పెరగటంతో వేలేరుపాడు మండలంలోని ఎద్దుల వాగు వంతెన ఈ నెలలో మూడోసారి నీట మునిగింది. దీంతో దిగువ ప్రాంతంలోని 18 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కోయిదా, కట్కూరు, సిద్ధారం, కాచారం, పూసుకుంది, తాళ్లగొంది, పేరంటపల్లి, టేకుపల్లి, టేకూరు, బుర్రెడ్డిగూడెం, ఎర్రమెట్ట, యడవల్లి, చిట్టం రెడ్డిపాలెం, మరో ఐదు గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. ఎద్దెల వాగు వద్ద అధికారులు నాటు పడవను ఏర్పాటు చేశారు. దీనిపైన ఆ గ్రామాల గిరిజనులు రాకపోకలు సాగిస్తున్నారు.

ఉద్ధృతంగా తమ్మిలేరు

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు తంగెళ్లమూడి వంతెన వద్ద తమ్మిలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరుకు నీటి ప్రవాహాం పెరిగింది. ఏలూరుకు ఇరువైపులా ఉన్న తమ్మిలేరు నీటి ప్రవాహాంతో కళకళ లాడుతుంది. మరోవైపు తమ్మిలేరులో నీటి ప్రవాహాం క్రమేపీ పెరుగుతుండటంతో ఏలూరు తూర్పు, పడమర లాకుల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షాలు ఇదే విధంగా మరికొన్ని రోజులు కొనసాగితే తమ్మిలేరుకు వరద ప్రమాదం పొంచి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు సైతం తమ్మిలేరు ఏటిగట్టు వెంబడి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

నిండుకుండలా కేకేఎం ఎర్రకాలువ జలాశయం

జంగారెడ్డిగూడెం: కొండప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరుతుండడంతో మండలంలోని కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి 400 క్యూసెక్కుల వరదనీరు చేరుతోందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 81.52 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్ధ్యం 4,428 టీఎంసీలు.

భద్రతా చర్యలు చేపట్టాలి

వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు నుంచి నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. జంగారెడ్డిగూడెంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి కేకేఎం ఎర్రకాలువ జలాశయంలో గణనాథులను నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు తీసుకువస్తుంటారు. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటిమట్టం దృష్టా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు నిమజ్జన కార్యక్రమాలకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

వేలేరుపాడు: ఎద్దేల వాగు నీట మునగడంతో పడవపై ప్రయాణిస్తున్న గిరిజనులు

ఏలూరు (టూటౌన్‌): తంగెళ్లమూడి వంతెన వద్ద తమ్మిలేరు ఉద్ధృతి

చింతలపూడి: అల్పపీడన ప్రభావంతో మెట్ట ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు అలుగులు పడి వరద నీరు రోడ్లపై నుంచి ప్రవహిస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు తమ్మిలేరు ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్ధాయికి చేరుకుంటోంది.

తమ్మిలేరుకు వరద

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్‌ నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ఖమ్మం జిల్లా, బేతుపల్లి రిజర్వాయర్‌కు అలుగు పడటంతో తమ్మిలేరు రిజర్వాయర్‌కు గురువారం వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు వద్దే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 341.98 అడుగులకు చేరుకుంది. గోనెలవాగు స్టోరేజ్‌ ట్యాంక్‌ నీటిమట్టం 341 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్‌ ఏఈ లాజరు తెలిపారు. ప్రస్తుతం ఖమ్మంజిల్లా, సత్తుపల్లి మండలం బేతుపల్లి అలుగు పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో గంటకు 500 క్యూసెక్కులకు పైగా వరద నీరు ఆంధ్రా కాల్వ ద్వారా ప్రాజెక్టులోకి వస్తుందన్నారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చునని అధికారులు చెప్పారు. ప్రాజెక్టు నీటిమట్టం 348 అడుగులకు చేరుకున్నాక వరద పరిస్థితిని అంచనా వేసి ప్రధాన గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తామని తెలిపారు.

వణికిస్తున్న వరద గోదావరి 1
1/4

వణికిస్తున్న వరద గోదావరి

వణికిస్తున్న వరద గోదావరి 2
2/4

వణికిస్తున్న వరద గోదావరి

వణికిస్తున్న వరద గోదావరి 3
3/4

వణికిస్తున్న వరద గోదావరి

వణికిస్తున్న వరద గోదావరి 4
4/4

వణికిస్తున్న వరద గోదావరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement