విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష విరమణ | Chaturmasya Deeksha Of Visakha Sharada Peethadhitham | Sakshi
Sakshi News home page

విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష విరమణ

Sep 29 2023 4:13 PM | Updated on Sep 29 2023 4:13 PM

Chaturmasya Deeksha Of Visakha Sharada Peethadhitham - Sakshi

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు  స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములు చేపట్టిన చాతుర్మాస్య దీక్ష శుక్రవారం ముగిసింది. రిషికేష్ వేదికగా జూలై 3వ తేదీన దీక్షకు శ్రీకారం చుట్టారు. అక్కడ తెలవారుజామున గంగాతీరంలో వపన సంస్కారం అనంతరం స్నానమాచరించారు. గంగమ్మ తల్లికి పూజలు చేసిన తర్వాత విశాఖ శ్రీ శారదాపీఠం రిషికేష్ ఆశ్రమంలో దీక్షను విరమించారు. ఈ సందర్భంగా భగవద్గీతను కొద్దిసేపు పారాయణ చేసారు.

అనంతరం వీరభద్ర మందిరాన్ని సందర్శించి విశేష అభిషేకం నిర్వహించారు. చాతుర్మాస్య దీక్ష ముగియడంతో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి శనివారం సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు. విశాఖ శారదా పీఠాధిపతులు తమ చాతుర్మాస్య దీక్షను ఏటా రిషికేష్ వేదికగా చేపట్టడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. దీక్షా సమయంలో లోక కళ్యాణార్ధం విశేష పూజలు, వైదిక కార్యక్రమాలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement