breaking news
sharada peetadhipathi swamy swaroopanandendra saraswathi
-
విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష విరమణ
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములు చేపట్టిన చాతుర్మాస్య దీక్ష శుక్రవారం ముగిసింది. రిషికేష్ వేదికగా జూలై 3వ తేదీన దీక్షకు శ్రీకారం చుట్టారు. అక్కడ తెలవారుజామున గంగాతీరంలో వపన సంస్కారం అనంతరం స్నానమాచరించారు. గంగమ్మ తల్లికి పూజలు చేసిన తర్వాత విశాఖ శ్రీ శారదాపీఠం రిషికేష్ ఆశ్రమంలో దీక్షను విరమించారు. ఈ సందర్భంగా భగవద్గీతను కొద్దిసేపు పారాయణ చేసారు. అనంతరం వీరభద్ర మందిరాన్ని సందర్శించి విశేష అభిషేకం నిర్వహించారు. చాతుర్మాస్య దీక్ష ముగియడంతో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి శనివారం సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు. విశాఖ శారదా పీఠాధిపతులు తమ చాతుర్మాస్య దీక్షను ఏటా రిషికేష్ వేదికగా చేపట్టడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. దీక్షా సమయంలో లోక కళ్యాణార్ధం విశేష పూజలు, వైదిక కార్యక్రమాలు చేపడుతున్నారు. -
‘రాజకీయ నేతలకు కొత్త ఏడాది గడ్డుకాలమే'
-
‘రాజకీయ నేతలకు కొత్త ఏడాది గడ్డుకాలమే'
విశాఖ : హేవిళంబి నామ సంవత్సరంలో రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేవారికి ఇబ్బందులు తప్పవని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. గ్రహాల స్థితిగతులు అనుకూలంగాల లేనందున ఎండలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ కాలసర్ప దోషం ఉందని, రాజకీయ నేతలకు కొత్త ఏడాది గడ్డుకాలమేనని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. ప్రభుత్వం విజ్ఞతతో యజ్ఞయాగాలు చేస్తే మేలు జరగవచ్చని అన్నారు. అలాగే దేశంలో భూకంపాలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.