చంద్రబాబు అరెస్ట్‌.. విధ్వంసానికి టీడీపీ కుట్ర | A.P. Skill Development Corruption Case: TDP Conspiracy For Riots Due To Chandrababu Arrest- Sakshi
Sakshi News home page

చంద్రబాబు అరెస్ట్‌.. విధ్వంసానికి టీడీపీ కుట్ర

Sep 9 2023 3:27 PM | Updated on Sep 9 2023 3:48 PM

Tdp Conspiracy For Riots Due To Chandrababu Arrest - Sakshi

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో విధ్వంసానికి టీడీపీ కుట్రకు తెరలేపింది.

సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో విధ్వంసం సృష్టించడానికి టీడీపీ కుట్రకు తెరలేపింది. చంద్రబాబుని తీసుకొచ్చే మార్గంలో అల్లర్లకు పథక రచన చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అన్ని జిల్లాల నేతలకు ఆదేశాలు అందినట్లు సమాచారం.

పలు చోట్ల పోలీసులపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. ప్రజా జీవనాన్ని ఇబ్బంది పెట్టి.. శాంతి భద్రతల సమస్య సృష్టించాలంటూ టీడీపీ నేతలకు కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టి తద్వారా మైలేజ్‌ పొందాలని టీడీపీ ప్లాన్‌ చేస్తోంది.

కాగా, నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్‌ హాల్‌ వద్ద ఆయన్ను అరెస్ట్‌ చేశారు సీఐడీ పోలీసులు. ఈ రోజు(శనివారం) తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్‌ చేశారు పోలీసులు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది.  ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద  కేసులు నమోదు చేశారు.
చదవండి: ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బాబుగారి ప్లాన్‌! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement