టీడీపీ, జనసేన రౌడీమూకల విధ్వంసకాండ  | tdp and janasena activists attack YSRCP activists in Bapatla district | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన రౌడీమూకల విధ్వంసకాండ 

Mar 11 2024 3:33 AM | Updated on Mar 11 2024 3:34 AM

tdp and janasena activists attack YSRCP activists in Bapatla district - Sakshi

టీడీపీ, జనసేన రౌడీమూకలు వదిలివెళ్లిన బైక్‌లు 

అర్ధరాత్రివేళ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల 20 బైక్‌లు ధ్వంసం 

గ్రామస్తులు కేకలు వేయడంతో తమ బైక్‌లు వదిలి పారిపోయిన రౌడీమూకలు 

బాపట్ల జిల్లా పుట్టావారిపాలెంలో ఘటన  

చెరుకుపల్లి: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పుట్టావారిపాలెంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన రౌడీలు విధ్వంసం సృష్టించారు. మద్యం తాగి గొడ్డళ్లు, ఇనుపరాడ్లు చేతపట్టుకుని అర్ధరాత్రి వేళ వైఎస్సార్‌సీపీకి చెందినవారి బైక్‌లను ధ్వంసం చేశారు. పుట్టావారిపాలెంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి మద్దతు పలుకుతున్నాయి.

ఈ క్రమంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు రౌడీలు మద్యం తాగి శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గొడ్డళ్లు, ఇనుప రాడ్లు పట్టుకుని వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతున్నవారి ఇళ్ల వద్దకు వెళ్లి హల్‌చల్‌ చేశారు. ఇళ్ల ముందు నిలిపిన 20 బైకులను ధ్వంసం చేశారు. గ్రామస్తులు కేకలు వేయడంతో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన రౌడీలు తమ బైక్‌లను వదిలి పారిపోయారు. గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచా­రం అందించారు. పోలీసులు వచ్చి 11 బైక్‌లు, ఇనుపరాడ్డును స్వా«దీనం చేసుకున్నారు. వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ దురాగతానికి పాల్పడిన రౌడీమూకలను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ మత్తి దివాకర రత్నప్రసాద్, వైఎస్సార్‌సీపీ మండల కన్వినర్‌ పైనం ఏడుకొండలరెడ్డి, స్థానిక సర్పంచ్‌ మొగలిపువ్వు కోటేశ్వరరావు పోలీసులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement