ఓ మాజీ కానిస్టేబుల్ కనుసన్నల్లో దందా మరి కొన్ని ప్రాంతాల్లో కనుమరుగైన ఇసుక కొండలు అక్రమార్కులకు పలు శాఖలకు చెందిన స్థానిక అధికారులు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు నిద్ర పోతున్న నిఘా వ్యవస్థ అధికార పార్టీ నేతల అండే కారణమంటున్న ప్రజలు కలెక్టర్, ఎస్పీ, మైనింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఫలితం
చంద్రబాబు దిశానిర్దేశం
ఫలించేనా..
నిద్రపోతున్న నిఘా వ్యవస్థ
చీరాలలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ఇసుక అక్రమ తవ్వకాలతో కొన్ని ప్రాంతాల్లో చెరువులుగా మారిన భూములు
చీరాల అర్బన్: చంద్రబాబు చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఉండదు. ఎన్నికల వేళ చెప్పిన హామీల్లో కప్పదాట్లు అందుకు నిదర్శనం. చీరాల నియోజవకర్గంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అందుకు నిదర్శనమని ప్రజలు అంటున్నారు. ఎక్కడ బాబు నీ ఉక్కు పాదమని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు రెండు రోజుల పాటు నిర్వహించిన సమీక్ష సమావేశంలో దిశా, నిర్దేశం చేసిన పలు అంశాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో రాజకీయ అండనేది బహిరంగ రహస్యం. దీంతో కింద స్థాయి అధికారులు స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఓ మాజీ కానిస్టేబుల్ కనుసన్నల్లో దందా
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఓ మాజీ కానిస్టేబుల్ కనుసన్నల్లో సాగుతోందని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అందుకు అతనికి రాజకీ య అండ ఉండడమే కారణం అంటున్నారు. అలా అండ, దండలు అందించేందుకు మూలవిరాట్టుకు, ఉత్సవ విగ్రహాలకు, భాజాభజతీంత్రలకు స్థాయిని బట్టి సంతృప్తి పరుస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
స్వామి కార్యం.. స్వకార్యం
ఎంత రాజకీయ అండ ఉన్నా, అధికారుల మద్దతు లేనిదే ఈ అక్రమ ఇసుక దందా సాగదు. ఈ క్రమంలో కొందరు అధికారులు స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దందా చేసే వ్యక్తికి సంబంధించిన వారైతే మిన్నకుంటూ, విడిగా ఎవరన్నా ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.
తీరప్రాంతంలోని ఓ ఎస్‌ఐపై ఆరోపణలు
తీరప్రాంతానికి చెందిన ఓ ఎస్‌ఐపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కార్యకర్త మాదిరి పనిచేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల తీరంలో ఓ స్థిరాస్తి వివాదానికి సంబంధించి అక్కడే ప్రైవేటు పంచాయితీ నిర్వహించాడనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి అతను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో బాధితుడు ఓ మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించాడు. ఆ మాజీ ఎమ్మెల్యే జోక్యంతో ఉన్నతాధికారులు ఆ ఎస్‌ఐకి చీవాట్లు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఇక స్టేషన్‌లో సామాన్యులకు న్యాయం జరగదనే భావనకు ఆ ప్రాంత ప్రజలు వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు.
చంద్రబాబు పలు అంశాలపై ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ క్రమంలో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందాలని చెప్పారు. అవినీతి, అక్రమాలకు చెక్ చెప్పాలన్నారు. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనైనా చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై స్పందించి కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, రేషన్ బియ్యం నల్లబజారుకు తరలటం, ప్రైవేటు పంచాయితీలు, తీరంలో అసాంఘిక కార్యకలాపాలు ఇలా అనేక రకాలైన చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగుతుంటే నిఘా వ్యవస్థ నిద్ర పోతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ పరిధిలో అది పోలీస్ శాఖ అయినా, ఇతర ఏ అంశానికి సంబంధించైనా నీడలా ఉండి జిల్లా పోలీస్ బాస్‌కు రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత స్పెషల్ బ్రాంచి (ఎస్‌బీ)ది. ఆ నిఘా వ్యవస్థ తన ఉనికిని కోల్పోయిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తీరంలో జరిగిన కోడి పందేలు నుంచి నేటి వరకు స్థానిక ఎస్‌బీ అధికారులు ఉన్నతాధికారులకు వాస్తవ పరిస్థితులను నివేదిస్తున్నారా? లేక వాస్తవాలు తెలిసీ ఉన్నతాధికారులు తెలీనట్లు నటిస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదు.
కొన్ని ప్రాంతాల్లో ఇసుక భూముల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతో భారీ గోతులు ఏర్పడి, అందులో నీరు చేరి కొన్ని చెరువులుగా మారాయి. పట్టా, అసైన్డ్ భూములతో పాటు కొంతమేర ప్రభుత్వ భూముల్లో కూడా తవ్వకాలు సాగిన సందర్భాలు ఉన్నాయంటున్నా రు. ఇక కొన్ని ప్రాంతాల్లో భారీ కొండలుగా ఉన్న ఇసుక తిన్నెలు కనుమరుగయ్యాయి. టీడీపీ జ మానాలో సుమారు 50వేల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా జరిగి ఉంటుందనే వాదనలు వి నిపిస్తున్నాయి. ఏర్పడ్డ గోతులు, కనుమరుగైన ఇసుక తిన్నెలను మైనింగ్ అఽధికారులు లెక్కలు క డితే అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని అంచనా.


