ఏసీబీ ఉమ్మడి గుంటూరుకు ఉగాది పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ ఉమ్మడి గుంటూరుకు ఉగాది పురస్కారాలు

Mar 14 2026 7:46 AM | Updated on Mar 14 2026 7:46 AM

నగరంపాలెం (గుంటూరు ఈస్ట్‌): రాష్ట్ర ప్రభుత్వం ఉగాది–26 పురస్కారాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గుంటూరు ఉమ్మడి జిల్లాకు ఒకటి ఉత్తమ, రెండు సేవా పతకాలు లభించాయి. ఉమ్మడి జిల్లా అదనపు ఎస్‌పీ మహేంద్ర మత్తేకు సేవా పతకం, హెడ్‌కానిస్టేబుల్‌ బి.శ్రీనివాసరావుకు ఉత్తమ సేవా పతకం, కానిస్టేబుల్‌ యు.సురేష్‌బాబు సేవా పతకానికి ఎంపికయ్యారు. ఏఎస్పీ మహేంద్ర మత్తే తొలుత గ్రేహాండ్స్‌, విశాఖపట్నం, పాడేరు, విజయవాడ జీఆర్పీ, విశాఖపట్నం అర్బన్‌ ఇంటిలిజెన్స్‌, శ్రీకాకుళం జిల్లా డీఎస్పీగా, విశాఖపట్నం సిటీ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీగా విధులు నిర్వర్తించారు. 2023లో అదనపు ఎస్‌పీగా ఉద్యోగోన్నతి పొంది, ఏసీబీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు బదిలీయ్యారు.

రుక్మిణి కల్యాణం అలంకారంలో నరసింహస్వామి

మంగళగిరిటౌన్‌: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం రుక్మిణి కల్యాణం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్య నిర్వహణా ధికారి కోగంటి సునీల్‌కుమార్‌ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా వింజమూరి శ్రీకృష్ణ రాజేంద్రప్రసాద్‌ కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా ప్రగడ నరసింహమూర్తి వ్యవహరించారు.

దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.57 లక్షలు విరాళం

నగరంపాలెం: స్థానిక లాలాపేటలోని పురాతనమైన శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం పునఃనిర్మాణానికి గుంటూరు కొత్తపేట పద్మావతి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ డాక్టర్‌ వీరగంధం సుబ్బారావు రూ.57 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శుక్రవారం సుబ్బారావు ఆయన భార్య సువర్ణపద్మావతి జ్ఞాపకార్థం లాలాపేట శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం బ్యాంక్‌ ఖాతాకు నగదు జమ చేశారు. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ నజీర్‌ కార్యాలయంలో దాత సుబ్బారావుని సత్కరించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ టి.సుభద్ర, మిర్చియార్డు డైరెక్టర్‌ కొనకళ్ల సత్యం పాల్గొన్నారు.

కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ

నరసరావుపేట:పట్టణంలోని కుమ్మరబజార్‌లో ఆ వర్గీయులు ఏర్పాటుచేసిన తొలి తెలుగు మహిళ రామాయణం కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కవయిత్రి మొల్ల గొప్పతనం గురించి వివరించారు. సమీపంలోని మహాలక్షమ్మ చెట్టు వద్ద పూజలు చేశారు. ఇరువురిని కుమ్మరి సంఘ వర్గీయులు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ ఎంపీపీ మంగమ్మ, శాలివాహన సంఘ జిల్లా అధ్యక్షుడు తొర్లకొండ చిన అంజయ్య, ఇంటలెక్చువల్‌ ఫోర్‌ రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, పట్టణ వర్కింగ్‌ అధ్యక్షులు అచ్చిశివకోటి, నాయకులు మోరా శ్రీనివాసరావు, షేక్‌ శిలార్‌, సంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement