నాగమోహన కృష్ణ పరిచయ సభకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలిరావాలి | - | Sakshi
Sakshi News home page

నాగమోహన కృష్ణ పరిచయ సభకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలిరావాలి

Mar 14 2026 7:46 AM | Updated on Mar 14 2026 7:46 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పిలుపు

రేపల్లె: వైఎస్సార్‌ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహనకృష్ణ పరిచయ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగ నాగార్జున శుక్రవారం పిలుపునిచ్చారు. నగరం మండలం పీటావారిపాలెంకు చెందిన పీటా నాగమోహనకృష్ణ బాధ్యతలు చేపట్టిన అనంతరం నియోజకవర్గ కేంద్రమైన రేపల్లె పట్టణానికి తొలిసారి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇసుకపల్లిలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిచయ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగార్జున కోరారు. నూతన సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన నాగమోహన్‌కృష్ణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement