స్కూలు బస్‌ డ్రైవర్‌ ఘాతుకం | School Bus Driver Abuses Girl In Karnataka | Sakshi
Sakshi News home page

స్కూలు బస్‌ డ్రైవర్‌ ఘాతుకం

Jan 3 2024 7:49 AM | Updated on Jan 3 2024 7:49 AM

School Bus Driver Abuses Girl In Karnataka - Sakshi

అభం శుభం తెలియని 8వ తరగతి బాలికను లోబర్చుకున్న సదరు పాఠశాల బస్సు డ్రైవర్‌.. చివరకు జనం ఏమంటారోనని భయపడి బాలికతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు.

యశవంతపుర: అభం శుభం తెలియని 8వ తరగతి బాలికను లోబర్చుకున్న సదరు పాఠశాల బస్సు డ్రైవర్‌.. చివరకు జనం ఏమంటారోనని భయపడి బాలికతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కమగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జిల్లా అజ్జంపుర తాలూకా గిరియాపుర గ్రామంలోని జ్ణానదీప ప్రైవేట్‌ స్కూల్‌ ఉంది.

 అందులో బాలిక (14) 8వ తరగతి చదువుతోంది. ఆమె రోజూ స్కూలు బస్సులో ఇంటికి వచ్చి వెళ్లేది. ఆమెపై తండ్రి వయసున్న బస్సు డ్రైవర్‌ సంతోష్‌ (38) కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రేమ దోమ అంటూ షికార్లకు తీసుకెళ్లాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు దండిస్తారని భయపడిన సంతోష్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తనతో పాటు బాలికను కూడా బలిగొనాలని కుట్ర పన్నాడు. సోమవారం విద్యారి్థని సమీపంలోని రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లి అక్కడ ఇద్దరూ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. 

స్కూలు యాజమాన్యంపై కేసు  
ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నందున వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. తమ కూతురు కనిపించడం లేదని స్థానిక అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వారు స్పందించి ఉంటే ప్రాణాలతో దక్కి ఉండేదని తల్లిదండ్రులు విలపించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement