కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి | Newly Wed Bride Found Dead Under Mysterious in Bengaluru | Sakshi
Sakshi News home page

కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి

Aug 14 2022 7:33 AM | Updated on Aug 14 2022 7:54 AM

Newly Wed Bride Found Dead Under Mysterious in Bengaluru - Sakshi

రూపాబాయి, గంగాధర్‌ల పెళ్లినాటి ఫొటో

బెం‍గళూరు: నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా కట్నం వేధింపులు కూడా ఈ ఘటనకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా మీయాపురలో జరిగింది. మియాపురకు చెందిన గంగాధర్‌తో అదే గ్రామానికి చెందిన రూపాబాయి(22)తో మూడు నెలల క్రితం వివాహమైంది. వివాహం సమయంలో మూడు గ్రాముల బంగారం తక్కువ ఇచ్చారంటూ గంగాధర తల్లిదండ్రులు రూపాబాయిని సూటిపోటి మాటలతో వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఇటీవల ఆమె గర్భం దాల్చింది. ఈక్రమంలో వేధింపులు మరింతగా పెరిగాయి. రెండు రోజుల క్రితం రూపాబాయి విషం తాగడంతో చెన్నగిరి ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అయితే తమ కుమార్తెతో ఆమె భర్త గంగాధర్, అత్త, మామలు బలవంతంగా విషం తాగించి రూపాబాయి మృతికి కారణమైనట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

చదవండి: (Extramarital Affair: అత్త హత్యకేసులో మేనల్లుడే నిందితుడు)

Advertisement
 
Advertisement
Advertisement