అత్త హత్యకేసులో మేనల్లుడే నిందితుడు.. భర్త, పిల్లలను వదిలి తనతో..

Man killed Woman Over Extramarital Affair in Bengaluru - Sakshi

బెంగళూరు: చెన్నపట్టణ పట్టణ పరిధిలోని మహదేశ్వర నగర్‌లో జులై 15న జరిగిన మహిళ హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు. అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మేనల్లుడే ఆమెను కడతేర్చాడని నిర్ధారించారు. మహదేశ్వర నగర్‌లోని ఒక ఇంట్లో పడక గదిలో 33 సంవత్సరాల వయసున్న మహిళ హత్యకు గురైనట్లు సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి 25 రోజులపాటు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అజయ్‌ సదరు మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

భర్త, పిల్లలను వదిలి తనతో వచ్చేయాలని అజయ్‌ ఆమెను బలవంతం చేసేవాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో కక్ష పెంచుకున్న అజయ్‌ జులై 15న భర్త లేని సమయంలో అత్తను హత్య చేశాడు. ఇంట్లో దొంగతనం జరిగినట్టు నమ్మించడానికి ఆమె మెడలో మాంగల్యం చైను, ఇతర విలువైన వస్తువులు, హతురాలి మొబైల్‌ను కూడా తీసుకెళ్లాడు. అయితే నిందితుడు మాంగల్యం చైను హలగూరులో ఒక దుకాణంలో తాకట్టు పెట్టడం, కాల్‌ రికార్డ్స్‌ నిందితుడిని సులభంగా పట్టించాయి.  

చదవండి: (ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top