Two Persons Died in AC Machine Explosion at Miryalaguda Road - Sakshi
Sakshi News home page

నల్లగొండలో ఘోరం: ఏసీ మెషిన్‌ పేలి తెగిపడ్డ ఇద్దరి శరీర భాగాలు

Jun 26 2023 1:54 PM | Updated on Jun 26 2023 2:50 PM

Nalgonda AC Machine Blast Kills Two - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఏసీ రిపేర్‌ చేస్తుండగా.. ఒక్కసారిగా పేలింది మెషిన్‌.. 

సాక్షి, నల్లగొండ: జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఘోర ప్రమాదం జరిగింది. ఏసీ మెషిన్‌ పేలి ఇద్దరు దుర్మరణం చెందారు. ప్రమాదం నుంచి మరో నలుగురు ప్రాణాలతో బయటపడగా.. మృతుల శరీరాలు చెల్లాచెదురై పడడంతో అక్కడంతా భయానకవాతావరణం నెలకొంది.

మిర్యాలగూడ రోడ్డు బర్కత్‌పుర కాలనీ న్యూస్టార్‌ ప్రూట్స్‌ గోడాన్‌లో ఏసీ మెషిన్‌ రిపేర్‌ చేస్తుండగా..  కంప్రెషర్‌ ఒక్కసారిగా పేలింది. పేలుడును గుర్తించి ముందుగానే నలుగురు బయటకు పరుగులు తీశారు. మెషిన్‌కు అతి సమీపంలో ఉన్న షేక్ కలీమ్, సాజిద్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. పేలుడు ధాటికి శరీర భాగాలు తెగిపడ్డాయి. ఎస్పీ సహా నల్లగొండ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: పెళ్లైనా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement