దేవుడు పూనుతున్నాడని చెప్పి కన్నతల్లి దాష్టీకం.. సొంత కొడుకునే దారుణంగా.. | Mother Assassinated Her Son In Mysore | Sakshi
Sakshi News home page

దేవుడు పూనుతున్నాడని చెప్పి కన్నతల్లి దాష్టీకం.. సొంత కొడుకునే దారుణంగా..

Jan 13 2022 10:40 AM | Updated on Jan 13 2022 2:23 PM

Mother Assassinated Her Son In Mysore - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొంతకాలంగా తనకు దేవుడు పూనుతున్నాడని చెప్పుకునేది. ఆమె విపరీత ధోరణిని చూసి భర్త కూడా దూరంగా ఉంటున్నాడు. 15 రోజుల కిందట భర్త దగ్గర ఉన్న కొడుకు శ్రీనివాస్‌ను పుట్టింటికి తీసుకెళ్లింది. సోమవారం రాత్రి..

సాక్షి, మైసూరు: కన్నబిడ్డని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన మాతృమూర్తి మృగంగా మారింది. కర్ణాటకలోని మైసూరు జిల్లా హెచ్‌.డి.కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో భవాని అనే మహిళ కొడుకు శ్రీనివాస్‌(4)ను వేట కొడవలితో నరికి చంపింది. ఆమెకు భర్త శంకర్‌ ఉన్నాడు. కొంతకాలంగా తనకు దేవుడు పూనుతున్నాడని చెప్పుకునేది. ఆమె విపరీత ధోరణిని చూసి భర్త కూడా దూరంగా ఉంటున్నాడు.

15 రోజుల కిందట భర్త దగ్గర ఉన్న కొడుకు శ్రీనివాస్‌ను పుట్టింటికి తీసుకెళ్లింది. సోమవారం రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ వేట కొడవలిలో చిన్నారిని భయానకంగా నరికి చంపింది. ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలున్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హెచ్‌.డి.కోటె పోలీసులు భవానీని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ప్రియుడి వేధింపులతోనే సుగుణ ఆత్మహత్య?

Advertisement
 
Advertisement
Advertisement