కేంద్రీయ విద్యాలయంలో వేధింపులు.. లైబ్రేరియన్‌పై పేరెంట్స్‌ దాడి | Kendriya Vidyalayam Librarian Bhanu Prakash Harassed Students | Sakshi
Sakshi News home page

కేంద్రీయ విద్యాలయంలో వేధింపులు.. లైబ్రేరియన్‌పై పేరెంట్స్‌ దాడి

Aug 14 2023 11:34 AM | Updated on Aug 14 2023 7:05 PM

Kendriya Vidyalayam Librarian Bhanu Prakash Harassed Students - Sakshi

సాక్షి, అనంతపూర్‌: విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు విద్యార్థినిల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్‌ లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలి పేరెంట్స్‌ అతడిపై దాడి చేశారు. ఈ ఘటన అనంతపూర్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఎస్కేయూలోని కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్‌ భాను ప్రకాశ్‌ నాయక్‌ విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థులను భాను ప్రకాశ్‌ దుర్భాషలాడాడు. ఇక, విద్యార్థులు తమ పేరెంట్స్‌కు చెప్పారు. దీంతో, ఆగ్రహానికి లోనైన విద్యార్ధులు పేరెంట్స్‌, బంధువులు.. భానుప్రకాశ్‌కు దేహశుద్ది చేశారు. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయంలో పేరెంట్స్‌ ఆందోళనకు దిగారు. అంతేకాకుండా భాను ప్రకాశ్‌పై ప్రిన్సిపాల్‌కు పేరెంట్స్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

ఇది కూడా చదవండి: Cyber Crime: రూ. 5 కట్టమని.. రూ.1.85 లక్షలు దోచుకున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement