కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రజాప్రతినిధి అందుకు విరుద్ధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని తన సంస్థకు ఆదాయం తెచ్చిపెట్టేందుకు పాటుపడుతున్నారు. ఏకంగా ప్రకృతి సంపదపై కన్నేశారు. అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల | - | Sakshi
Sakshi News home page

కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రజాప్రతినిధి అందుకు విరుద్ధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని తన సంస్థకు ఆదాయం తెచ్చిపెట్టేందుకు పాటుపడుతున్నారు. ఏకంగా ప్రకృతి సంపదపై కన్నేశారు. అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల

Aug 1 2026 1:43 AM | Updated on Aug 1 2026 1:43 AM

కళ్యాణదుర్గం : ప్రకృతి సంపద యథేచ్ఛగా దోపిడీకి గురవుతోంది. అధికార పార్టీకి చెందిన వారే కొల్లగొడుతుండటంతో అధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ఎస్‌ఆర్‌సీ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ కంపెనీ ఇటీవల కంబదూరు మండలంలో పదుల సంఖ్యలో గాలిమరలు ఏర్పాటు చేస్తోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బీటీపీ కాలువ పనులను సైతం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆయా పనులకు కాంక్రీట్‌ అవసరముంది. ఇందుకు అవసరమైన కంకర, ఇసుక సులభంగా లభించే కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం గ్రామాన్ని ఎంచుకుంది. ఇక్కడ ఒక మిక్సింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. రాళ్ల అనంతపురం సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి జేసీబీతో ఇసుక తవ్వకాలు చేపట్టింది. నాలుగైదు ట్రాక్టర్ల ద్వారా ప్లాంట్‌ వద్దకు ఇసుకను భారీగా డంప్‌ చేస్తోంది. మార్కెట్లో టన్ను ఇసుక ధర రూ.1800 నుంచి రూ.2000 వరకు పలుకుతోంది. సివిల్‌ వర్క్‌లు, ఇతర ప్రాంతాల్లోని పనుల కోసం ప్లాంట్‌ వద్ద నుంచి రోజూ సగటున 20 నుంచి 30 టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలుతోంది. టిప్పర్‌ (టస్కర్‌)లో 15 నుంచి 20 టన్నుల ఇసుక పడుతుంది. గడిచిన రెండేళ్లుగా ఇసుక రూపంలోనే కోట్లాది రూపాయలు ఎస్‌ఆర్‌సీ సొమ్ము చేసుకుంటోంది. ఇక కాంక్రీట్‌కు అవసరమైన కంకరను కూడా దేవేంద్రపురం తండా వద్దనున్న క్రషర్‌ నుంచి సరఫరా చేసుకుంటోంది.

ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు

ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అట్టడుగుకుపోతున్నాయని, నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రశ్నించిన రాళ్ల అనంతపురం గ్రామ ప్రజలను, వైఎస్సార్‌సీపీ నాయకులను అమిలినేని అనుచరులు తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. తమకెదురు తిరిగితే అక్రమ కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయాలన్నీ అధికారులకు తెలిసినా ఏమీ తెలియదన్నట్లుగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక రీచ్‌ కోసం పట్టు!

ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణాతో రూ.కోట్లు వెనకేసుకున్న అమిలినేని.. సంస్థ అవసరాల కోసం కంబదూరు మండలంలోని పెన్నా నది పరివాహక ప్రాంతాలైన నూతిమడుగు, రాళ్ల అనంతపురం, చెన్నంపల్లి, గూళ్యం పరిసర ప్రాంతాల్లో ఇసుక రీచ్‌ ఏర్పాటు చేసుకునేందుకు మైనింగ్‌, రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇసుక రీచ్‌లు నడుస్తున్నాయి. కానీ ఒక ప్రైవేట్‌ సంస్థ రీచ్‌ కోసం పట్టు పడుతుండటం గమనార్హం.

డంప్‌కు అనుమతులు లేవు

ఎస్‌ఆర్‌సీ సంస్థ తన పనులకు ఇసుక అవసరముందని లేఖ పెట్టింది. ఇందుకోసం ఇసుక రీచ్‌కు దరఖాస్తు చేసుకుంది. దీనిపై పరిశీలన చేస్తున్నాం. ఇక మిక్సింగ్‌ ప్లాంట్‌ వద్ద అక్రమంగా ఇసుక డంప్‌ చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం. ఇసుక డంప్‌ చేయడానికి అనుమతులు లేవు.

– ఆదినారాయణ, డిప్యూటీ డైరెక్టర్‌, మైనింగ్‌ అండ్‌ జియాలజి, అనంతపురం

పట్టపగలే యథేచ్ఛగా తవ్వకాలు

రెండేళ్లలో రూ.కోట్ల ఇసుక అక్రమ రవాణా

రాళ్ల అనంతపురం వద్ద భారీగా ఇసుక డంప్‌

ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, బెదిరింపులు

చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement