వైభవంగా రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రథోత్సవం

Aug 1 2026 1:43 AM | Updated on Aug 1 2026 1:43 AM

విడపనకల్లు: గడేకల్లులో ప్రసిద్ధ భీమలింగేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సాయంత్రం స్వామివారి ప్రతిమను అందంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చారు. హరహర మహాదేవ అంటూ భక్తులు రథాన్ని లాగారు. ప్రధాన వీధుల గుండా రథం ముందుకు సాగింది. భీమలింగేశ్వరున్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఏపీతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గడేకల్లు కిక్కిరిసిపోయింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement