కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి | 8 AP Residents Killed In Today Road Accident At Karnataka Chikkaballapur - Sakshi
Sakshi News home page

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి

Oct 26 2023 9:39 AM | Updated on Oct 26 2023 12:08 PM

Karnataka: Road Accident At Chikkaballapur - Sakshi

చిక్కబళ్లాపుర్​లో ఆగి ఉన్న ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా.. 8 మంది మరణించారు.

కర్ణాటక: చిక్కబళ్లాపుర్​లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా.. 12 మంది మరణించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.

పొగ మంచు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల  కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని చిక్‌బళ్లాపూర్‌ ఎస్పీ నగేష్‌ పరిశీలించారు. ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, మృతుల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు.
 

చదవండి: వాకింగ్‌ చేస్తూ.. గుండెపోటుతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

Advertisement
 
Advertisement
Advertisement