ఇదేం వికృతానందం.. పీజీలోకి వెళ్లి యువతులు స్నానం చేస్తుండగా.. | Karnataka: Police Arrest Man Molesting Girls In Hostel | Sakshi
Sakshi News home page

ఇదేం వికృతానందం.. పీజీలోకి వెళ్లి యువతులు స్నానం చేస్తుండగా..

Jun 26 2023 2:38 PM | Updated on Jun 26 2023 3:15 PM

Karnataka: Police Arrest Man Molesting Girls In Hostel - Sakshi

కృష్ణరాజపురం(బెంగళూరు): పీజీలో ఉంటున్న యువతులను ఫొటోలు తీస్తూ వికృతానందం చెందుతున్న చిక్కబళ్లాపురకు చెందిన ఆశోక్‌ అనే కామాంధుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహాదేవపురలోని హోడిలో లేడీస్‌ హాస్ట్‌ల్స్ ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థినులు అందులో ఉంటున్నారు.

నిందితుడు తన సమీపంలోని పీజీల్లోకి చొరబడి యువతులు స్నానాల చేస్తుండగా రహస్యంగా ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. ఇటీవల ఓ పీజీలో రహస్యంగా వీడియో  తీస్తుండగా దీనిని గమనించిన ఓ యువతి చుట్టు పక్కన ఉండే వారిని అప్రమత్తం చేయడంతో యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని ఫోన్‌ను పరిశీలించగా యువతులు స్నానాలు చేసే దృశ్యాలు కనిపించాయి. దీంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్‌పెక్టర్‌ తెలిపారు. 

చదవండి: ఐదేళ్లకే నూరేళ్లూ నిండాయా కన్నా!

Advertisement
 
Advertisement
Advertisement