పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట | Love Marriage Couple Seeks Police Protection | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

Nov 15 2026 9:55 AM | Updated on Nov 15 2026 9:55 AM

Love Marriage Couple Seeks Police Protection

చాపాడు పోలీస్‌స్టేషన్‌ వద్ద ప్రేమ జంట

వైఎస్‌ఆర్‌ జిల్లా: పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట శనివారం సాయంత్రం చాపాడు పోలీసులను ఆశ్రయించింది. మండలంలోని గుంతచీపాడుకు చెందిన సారుకొల్ల వీరప్రసాద్, నెల్లూరు టౌన్‌కు చెందిన స్రవంతి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమకు వారి కుటుంబ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో శనివారం మండలంలోని విశ్వనాథపురం వద్ద గల శ్రీవీరాంజనేయస్వామి దేవస్థానం సన్నిధిలో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల వలన తమకు ప్రాణహాని ఉందని చాపాడు పోలీస్‌స్టేషన్‌ను వారు ఆశ్రయించి ఎస్‌ఐ చిన్నపెద్దయ్యకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement