తీవ్ర తుపానుగా బలపడనున్న వాయుగుండం | Andhra Pradesh: Severe Cyclonic Storm By November 17 Says IMD | Sakshi
Sakshi News home page

తీవ్ర తుపానుగా బలపడనున్న వాయుగుండం

Nov 15 2026 9:35 AM | Updated on Nov 15 2026 9:43 AM

Andhra Pradesh: Severe Cyclonic Storm By November 17 Says IMD

సాక్షి, విశాఖపట్నం: ఏపీ కోస్తా తీరానికి తీవ్ర తుపాను ముప్పు పొంచి ఉంది. రాగల 24 గంటల్లో తుపానుగా వాయుగుండం బలపడనుంది. మంగళవారం నాటికి తీవ్ర తుపానుగా వ్యవస్థ బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 860 కి.మీ, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 1040 కిమీ దూరంలో వాయుగుండం కొనసాగుతోంది. అండమాన్ దీవులుకు  700 కి.మీ గోపాల్‌పూర్ (ఒడిశా)కు1160 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది.

ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండం బలపడనుంది. తీవ్ర తుపాను ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం ఉందని.. ఇవాళ(ఆదివారం) సాయంత్రం లోపు సముద్రంలో వేట చేస్తున్న మత్స్యకారులు తీరానికి రావాలని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు.

ఇదీ చదవండి: పంచాయతీల్లోనూ అరాచకమే!

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement