భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి.. | Sakshi
Sakshi News home page

భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..

Published Fri, May 17 2024 5:26 AM

Gym trainer passed away

జిమ్‌ ట్రైనర్‌ మృతి 

యశవంతపుర: గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్యకు వీడియో కాల్‌ చేసి తిరిగి రావాలని అర్థించాడు ఓ భర్త. దీనికి ఆమె నిరాకరించడంతో బెదిరించాలని ఉరేసుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు బాగలగుంటెలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన అమిత్‌కుమార్‌ సాహ (28) దాసరహళ్లిలో జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం హసన్‌కు చెందిన యువ­తిని  ప్రేమించి పెళ్లి చేసు­కున్నాడు. 

చదువు నిమి­త్తం భార్యను నర్సింగ్‌ కోర్సులో చేర్చాడు. ఆమె నిరంతరం ఫోన్‌లో స్నేహితులతో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో భార్యతో గొడపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడం­తో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో గురువారం అమిత్‌ భార్యకు వీడియో కాల్‌ చేసి ఇంటికి రావాలని బతిమాలాడు. రాకపోతే ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించాడు. ఇంతలో చేతిలోని మొబైల్‌ ఫోన్‌ కింద పడటంతో పాటు గొంతుకు ఉరి బిగిసి మృత్యువాత పడ్డాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement