TS: గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం  | Four Officers Arrested In Sheep Scam Case | Sakshi
Sakshi News home page

TS: గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం 

Feb 22 2024 6:54 PM | Updated on Feb 22 2024 9:29 PM

Four Officers Arrested In Sheep Scam Case - Sakshi

 గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది.

ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్‌లను ఏసీబీ అరెస్ట్‌ చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు.. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించారు.

రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన ఇటీవల కాగ్​ కూడా తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement